AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Foldable Phone: ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతోంది! భయటపడ్డ రహస్యం

Apple Foldable Phone: శాంసంగ్‌ డిప్‌ప్లే ప్రెసిడెంట్ లీ చియోంగ్-హ్యూన్ ఇటీవలే కంపెనీ ఫోల్డబుల్ ఫోన్‌ల కోసం OLED ప్యానెల్‌ల భారీ ఉత్పత్తిని ప్రారంభించబోతోందని వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆపిల్ కోసం కావచ్చని టెక్ పరిశ్రమలో ఒక ప్రచారం జరుగుతోంది. ఇది ఆపిల్, శామ్‌సంగ్ భాగస్వామ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు..

Apple Foldable Phone: ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ రాబోతోంది! భయటపడ్డ రహస్యం
Subhash Goud
|

Updated on: Oct 01, 2025 | 1:47 PM

Share

ప్రస్తుతం స్మార్ట్ఫోన్ప్రపంచం కొనసాగుతోంది. శాంసంగ్డిస్ప్లే ప్రెసిడెంట్ లీ చియోంగ్ ఒక అమెరికన్ కంపెనీ కోసం ఫోల్డబుల్ ఫోన్ కోసం సామ్‌సంగ్ OLED ప్యానెల్‌ల భారీ ఉత్పత్తిని ప్రారంభిస్తోందని ధృవీకరించారు. కంపెనీ పేరు వెల్లడించనప్పటికీ ఇది ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ కావచ్చునని భావిస్తున్నారుశాంసంగ్డిప్ప్లే ప్రెసిడెంట్ లీ చియోంగ్-హ్యూన్ ఇటీవలే కంపెనీ ఫోల్డబుల్ ఫోన్‌ల కోసం OLED ప్యానెల్‌ల భారీ ఉత్పత్తిని ప్రారంభించబోతోందని వెల్లడించారు. ఈ ఉత్పత్తి ఆపిల్ కోసం కావచ్చని టెక్ పరిశ్రమలో ఒక ప్రచారం జరుగుతోంది. ఇది ఆపిల్, శామ్‌సంగ్ భాగస్వామ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు.

ఇది కూడా చదవండి: LPG Gas: దసరాకు ముందు షాకిచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందంటే

ఐఫోన్ ఫోల్డ్కు సంబంధించిన తాజా లీక్‌లు:

నివేదికల ప్రకారం, ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ 5.5-అంగుళాల కవర్ డిస్ప్లే, 7.8-అంగుళాల లోపలి ఫోల్డింగ్ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చు. ఈ పరికరం ఫేస్ ఐడికి బదులుగా సైడ్-మౌంటెడ్ టచ్ ఐడి సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ డిజైన్ ఆపిల్ మునుపటి ఐఫోన్‌ల నుండి పూర్తిగా భిన్నంగా, భవిష్యత్తుగా ఉంటుంది. ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఇటీవల ప్రారంభించినప ఐఫోన్ ఎయిర్ లాగా రెట్టింపు డిజైన్‌ను కలిగి ఉంటుందని కూడా చెబుతున్నారు. టెక్ విశ్లేషకులు అంచనా ప్రకారం ఆపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్‌ను సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు లాంచ్ చేయవచ్చు. అయితే, లాంచ్ టైమ్‌లైన్ కూడా మారవచ్చు. ఆపిల్ ఎల్లప్పుడూ తన ఉత్పత్తులతో ఆశ్చర్యపరుస్తుంది. అందుకే తుది తేదీ ఖరారు అయ్యే వరకు ఇది ఊహాగానాలుగానే ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays in October: అక్టోబర్‌లో పాఠశాలలకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి వరకు అంటే..

మార్క్ గుర్మాన్ నివేదిక..

టెక్ రిపోర్టర్ మార్క్ గుర్మాన్ తన “పవర్ ఆన్” వార్తాలేఖలో ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ చాలా సన్నగా ఉంటుందని, అధునాతన మడతపెట్టే సాంకేతికతను ఉపయోగిస్తుందని పేర్కొన్నారు. ఈ పరికరాన్ని చైనాకు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ ఉత్పత్తి చేస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ఆపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటుందని చెబుతున్నారు.

Samsung Galaxy Z సిరీస్‌తో పోటీ:

శాంసంగ్గెలాక్సీ జెడ్ సిరీస్ ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఈ సిరీస్‌కు నేరుగా సవాలు విసరనుంది. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రసిద్ధ ఫోల్డబుల్స్‌ను బట్టి చూస్తే, ఆపిల్ గట్టి పోటీని ఎదుర్కొంటుంది. అందుకే ఆపిల్ తన కొత్త ఫోల్డబుల్ ఐఫోన్‌తో తనను తాను విభిన్నంగా మార్చుకోవాలి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి