Amazon Scam: ఖాతాదారులకు అమెజాన్ హెచ్చరిక.. బ్లాక్ ఫ్రైడే పేరుతో ప్రైమ్ వివరాల తస్కరణ..!
బ్లాక్ ఫ్రైడే పేరుతో వినియోగదారులను దోచేయడానికి ప్రయత్నిస్తున్నారని అమెజాన్ హెచ్చరించింది. ముఖ్యంగా స్కామ్ మెయిల్స్, కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ప్రైమ్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఈ ప్రైమ్ ఖాతాలను యాక్సెస్ చేసి హాలీడే షాపింగ్ డీల్స్‌ను పొందుతున్నారని వివరించింది. ముఖ్యంగా దుకాణదారులు హాలీడే సేల్స్‌లో కొనడానికి ఆసక్తి చూపుతున్నందున ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన నేర కార్యకలాపాలు పెరిగిందని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు పెరిగాయి. ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచే ఇంటికే వస్తువులను తెప్పించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. మొదట్లో ఈ ఆఫర్లు అగ్రరాజ్యం అమెరికాలోనే అందుబాటులో ఉన్నా క్రమేపి అన్ని దేశాలకు విస్తరించింది. అయితే ముఖ్యంగా అమెరికాలో బ్లాక్ ఫ్రైడే పేరుతో నిర్వహించే సేల్ గురించి ఎక్కువశాతం మంది ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే స్కామర్లు ఈ అవకాశాన్ని అనువుగా చేసుకుని బ్లాక్ ఫ్రైడే పేరుతో వినియోగదారులను దోచేయడానికి ప్రయత్నిస్తున్నారని అమెజాన్ హెచ్చరించింది. ముఖ్యంగా స్కామ్ మెయిల్స్, కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా ప్రైమ్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. ఈ ప్రైమ్ ఖాతాలను యాక్సెస్ చేసి హాలీడే షాపింగ్ డీల్స్‌ను పొందుతున్నారని వివరించింది. ముఖ్యంగా దుకాణదారులు హాలీడే సేల్స్‌లో కొనడానికి ఆసక్తి చూపుతున్నందున ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన నేర కార్యకలాపాలు పెరిగిందని తెలుస్తోంది. ఈ తాజా స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ముఖ్యంగా రెండు రకాల స్కామ్‌లు పెరుగుతున్నాయని అమెజాన్ గుర్తించింది. వార్షిక ఫ్రీ బ్లాక్ ఫ్రైడ్ ప్రమోషన్‌తో పాటు ఈ-మెయిల్ అటాచ్‌మెంట్ స్కామ్ పెరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యంగా స్కామర్లు అమెజాన్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌లుగా నటిస్తారు. ముఖ్యంగా షాపులకు అటాచ్‌మెంట్‌లను పంపి వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ఖాతాలు నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ-మెయిల్‌లో వచ్చే లింక్‌ను వాడి ఖాతాదారులు లాగిన్ అవ్వగానే వారి లాగిన్ డేటాను తస్కరిస్తున్నారు. అలాగే కొనుగోలుదారులు ఫిషింగ్ వెబ్‌సైట్స్‌ను అసలైన అమెజాన్ సైట్‌లుగా అనుకోని ఏవైనా కొనుగోలు చేస్తే వారి బ్యాంకు ఖాతా వివరాలు కూడా దొంగలిస్తున్నారని తెలుస్తోంది. ఈ తాజా స్కామ్ గురించి అమెజాన్ ఎప్పటికప్పుడు వినియోగదారులను హెచ్చరిస్తుందని అమెజాన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అలాగే ఫిషింగ్ వెబ్‌సైట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
45,000 ఫిషింగ్ సైట్‌ల మూసివేత
అమెజాన్ తన ఖాతాదారులను మోసాల నుంచి రక్షించడానికి ఏకంగా 45,000 ఫిషింగ్ వెబ్‌సైట్లతో పాటు 15,000 నెంబర్లను మూసేస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఈ సైట్స్ ద్వారా నేరస్తులు అమెజాన్ ఆర్డర్ పేజీలా కనిపించేలా స్పామ్ మెయిల్స్‌ను ఖాతాదారులకు పంపి వాటి ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారని తెలుస్తోంది. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ వినియోగదారులు స్కామ్ సైట్స్‌పై అప్రమత్తంగా ఉండాలని టెక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







