Jio AirFiber: చవకైన జియో 5జీ ఫైబర్ మీ నగరానికి వచ్చేసింది! కనెక్షన్ కోసం ఇలా చేయండి..

ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ 5జీ ఫిక్స్‌డ్-వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్ జియో ఎయిర్ ఫైబర్ ను దేశ వ్యాప్తంగా వినియోగంలోకి తెస్తోంది. ఇప్పటికే దేశంలోని 115 నగరాల్లో ఈ ఎయిర్ ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.సెప్టెంబర్ 2023లో ప్రారంభమైన ఈ జియో ఎయిర్ ఫైబర్.. వైర్డు కనెక్షన్‌ వెళ్లడం కష్టతరమైన ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది.

Jio AirFiber: చవకైన జియో 5జీ ఫైబర్ మీ నగరానికి వచ్చేసింది! కనెక్షన్ కోసం ఇలా చేయండి..
Jio Air Fiber
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2023 | 12:00 PM

టెలికం రంగంలో సెన్సేషన్ రిలయన్స్ జియో. తక్కువ ధరలోనే నాణ్యమైన సేవలను అందిస్తూ.. గ్రామీణ భారతానికి కూడా ఇంటర్ నెట్ సేవలను దగ్గర చేయడంలో విజయవంతమైంది. ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ 5జీ ఫిక్స్‌డ్-వైర్‌లెస్ యాక్సెస్ సర్వీస్ జియో ఎయిర్ ఫైబర్ ను దేశ వ్యాప్తంగా వినియోగంలోకి తెస్తోంది. ఇప్పటికే దేశంలోని 115 నగరాల్లో ఈ ఎయిర్ ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.సెప్టెంబర్ 2023లో ప్రారంభమైన ఈ జియో ఎయిర్ ఫైబర్.. వైర్డు కనెక్షన్‌ వెళ్లడం కష్టతరమైన ప్రాంతాలకు సైతం వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ పోర్టబుల్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవ 1.5 జీబీపీఎస్ వరకు వేగంతో ఇంటర్ నెట్ సేవలను అందిస్తుంది. ఇది గృహాలకు, కార్యాలయ అవసరాలకు సైతం వినియోగించుకోవచ్చు.

జియో ఎయిర్ ఫైబర్ లభ్యత..

రిలయన్స్ జియో తన ఎయిర్‌ఫైబర్ సేవను 2023, సెప్టెంబర్ 19న దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలతో ప్రారంభించింది. తక్కువ వ్యవధిలోనే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లోని మొత్తం 115 నగరాలకు తన సేవను విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ఎయిర్ ఫైబర్ అందుబాటులో ఉంది. మహారాష్ట్రలో ముంబై, పూణే, నాగ్‌పూర్, నాందేడ్, నాసిక్‌లలో అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో కూడా ఈ సేవ అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో 2023 చివరిలోపు మరిన్ని నగరాలకు ఎయిర్‌ఫైబర్‌ని విస్తరించాలని యోచిస్తోంది. మీ ప్రాంతంలో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయడానికి, రిలయన్స్ జియో వెబ్‌సైట్‌ని సందర్శించండి.

జియో ఎయిర్‌ఫైబర్ ధర..

జియో ఎయిర్‌ఫైబర్ సర్వీస్ రెండు ప్లాన్ ఆప్షన్లను అందిస్తోంది. ఎయిర్‌ఫైబర్, ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ పేరిట ఉంటాయి. కాగా ఈ ప్లాన్లకు అదనంగా రూ. 1000 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ వర్తిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే 12 నెలల ప్లాన్‌ని ఎంచుకునే వినియోగదారులకు ఈ ఇన్‌స్టాలేషన్ ఛార్జీ నుంచి మినహాయింపు ఉంటుందని రిలయన్స్ పేర్కొంది.

ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్..

  • దీనిలో మూడు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 599, రూ. 899, రూ. 1199.
  • ఇంటర్నెట్ వేగం 100 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది.
  • 550కి పైగా డిజిటల్ చానెల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.
  • రూ.1,199 ప్లాన్‌లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియం కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లు వస్తాయి.

ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్స్..

  • దీనిలో కూడా మూడు రకాల ధరలతో ప్లాన్స్ ఉన్నాయి. అవి రూ. 1,499, రూ. 2,499, రూ. 3,999.
  • ఇంటర్నెట్ వేగం 1 జీబీపీఎస్ వరకు ఉంటుంది.
  • నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియంతో సహా 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ ఉంటుంది.
  • కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు జియో ఎయిర్‌ఫైబర్ కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా వినియోగదారులకు అందిస్తోంది. అది పేరెంటల్ కంట్రోల్స్, వైఫై 6 సపోర్టు, ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది.

జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని ఎలా పొందాలి..

  • మొదట లభ్యతను తనిఖీ చేయండి. మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవడానికి జియో వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదా మై జియో యాప్‌ని ఉపయోగించండి లేదా జియో కస్టమర్ సపోర్ట్‌ని సంప్రదించండి.
  • బుకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి 60008-60008కి మిస్డ్ కాల్‌ని డయల్ చేయొచ్చు. లేదా జియో వెబ్‌సైట్‌ని సందర్శించడం లేదా మై జియో యాప్‌ని ఉపయోగించి బుక్ చేసుకోవచ్చు. అలాగే మీ సమీపంలోని జియో స్టోర్‌ని సందర్శించి కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని అందించండి. నిర్ధారణ కోసం వేచి ఉండండి. మీ భవనం లేదా ప్రదేశంలో సేవ అందుబాటులోకి వచ్చిన తర్వాత జియో మిమ్మల్ని సంప్రదిస్తుంది.
  • మీ బుకింగ్ ధృవీకరించబడిన తర్వాత, మీరు వైఫై రూటర్, 4కే స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్, అవుట్‌డోర్ యూనిట్‌తో కూడిన మీ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌ని అందుకుంటారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..