AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఆఫీసుకి రావాల్సిందే అన్నారు.. రూ. 1.69 కోట్ల ప్యాకేజ్ జాబ్‌కు గుడ్ బై

ఓ ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్ లాభదాయకంగా ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెలవు తీసుకోకుండానే తన కుటుంబంతో గడిపే అవకాశం అతనికి లభించింది. కొంతమందిని చాలా కంఫర్ట్ జోన్‌లోకి తీసుకువచ్చింది. దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు గుడ్ బై చెప్పేసి ఇక ఆఫీసు రండి అన్నది. బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. అమెజాన్ సంస్థలో ఓ వ్యక్తి రూ. 1.69 కోట్ల ప్యాకేజీతో ఏప్రిల్ 2020లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా చేరారు.

Viral News: ఆఫీసుకి రావాల్సిందే అన్నారు.. రూ. 1.69 కోట్ల ప్యాకేజ్ జాబ్‌కు గుడ్ బై
Amazon
Surya Kala
|

Updated on: Nov 11, 2023 | 11:43 AM

Share

ఓ వైపు కొందరికి చేసేందుకు సరైన ఉద్యోగం దొరకడం లేదని నిరాశతో జీవిస్తున్నారు.. మరోవైపు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ పలు కంపెనీలు ఉద్యోగస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం  ఉద్యోగాల కొరత భారీగా ఉంది. మరోవైపు ఉద్యోగుల తొలగింపుల కార్యక్రమం భారీగా జరుగుతోంది. ఇటువంటి పరిస్థిలున్న ఇప్పుడు ఎవరైనా కోట్లు జీతం వచ్చే ఉద్యోగాన్ని వద్దు అంటూ  వదిలేసి వెళ్ళిపోతే ఎవరైనా ఏమని అంటారు.. ఇలాంటి షాకింగ్ ఉదంతం అమెరికాలో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి ఒక్క విషయం నచ్చక 1.6 కోట్ల రూపాయల జీతం వస్తున్న ఉద్యోగాన్ని హఠాత్తుగా వదిలేశాడు. అయితే ఇలా ఉద్యోగానికి గుడ్ బై చెప్పడానికి కారణం అతని ఆత్మగౌరవానికి భంగం కలగడం కాదు. అయితే ఉద్యోగం మానేయడానికి అసలు కారణం తెలిస్తే షాక్ తింటారు.

కరోనా కాలంలో ప్రపంచంలోని ప్రతి కంపెనీ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మోడల్‌ను అవలంబించింది. చిన్న కంపెనీ, పెద్ద కంపెనీ అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో కొందరు  ఇంటి నుండి పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తే.. మరికొందరు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ని ఎంజాయ్ చేశారు. అలా ఓ ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్ లాభదాయకంగా ఉంటుందని అర్థమైంది. ఎందుకంటే సెలవు తీసుకోకుండానే తన కుటుంబంతో గడిపే అవకాశం అతనికి లభించింది. కొంతమందిని చాలా కంఫర్ట్ జోన్‌లోకి తీసుకువచ్చింది. దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు గుడ్ బై చెప్పేసి ఇక ఆఫీసు రండి అని అనగానే చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధ పడ్డారు కూడా..

బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. అమెజాన్ సంస్థలో ఓ వ్యక్తి రూ. 1.69 కోట్ల ప్యాకేజీతో ఏప్రిల్ 2020లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెజాన్ తన ఉద్యోగులందరినీ ఆఫీసుకు రమ్మనమని చెప్పింది. అయితే ఈ వ్యక్తి న్యూయార్క్‌లో ఇల్లును కొనుక్కున్నాడు. దీంతో తాను ఆఫీసుకు వచ్చి ఉద్యోగం చేయడం కష్టం అంటూ ఉద్యోగం వదిలేసి కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

న్యూయార్క్ కు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని సీటెల్ కు మారమని కంపెనీ మేనేజర్ ఒత్తిడి తీసుకుని రావడంతో కోట్ల జీతం వస్తున్న ఉద్యోగానికి ఎండ్ కార్డు వేసేశాడు. వాస్తవానికి తాను తన రిపోర్టింగ్ మేనేజర్‌తో తన ఇబ్బంది గురించి చెప్పానని.. అయినప్పటికీ మేనేజర్ వినకుండా తనను సీటెల్‌కు మారమని ఒత్తిడి చేయడం ప్రారంభించినట్లు వెల్లడించాడు. ఉన్న ఉద్యోగం వదిలేసి… ఇప్పుడు మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అమెజాన్ ఇస్తున్న ప్యాకేజీతోనే మరో కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేస్తున్నాని చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!