Telangana: భద్రాచలం ఏజెన్సీ కి వచ్చిన కొత్త టెక్నాలజీ.. 45 ఏళ్ల భవనం 4 అడుగులు పైకి లేచింది.. ఎలాగంటే..

Bhadradri Kothagudem: వర్షపు నీరు చుట్టూ చేరటంతో ఆయా ఇళ్లలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. దీంతో కొంతమంది నిపుణులు సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. దీని ద్వారా పిల్లర్ల దిగువన జాకీలు పెట్టి లేపి బిల్డింగ్ ఎత్తును పెంచుతున్నారు.. ఇలా ఇప్పటివరకు అనేక పట్టణాల్లో విజవవంతం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ సక్సెస్‌ సాధించింది.

Telangana: భద్రాచలం ఏజెన్సీ కి వచ్చిన కొత్త టెక్నాలజీ.. 45 ఏళ్ల భవనం 4 అడుగులు పైకి లేచింది.. ఎలాగంటే..
New Building Lifting Technology
Follow us
N Narayana Rao

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 11, 2023 | 11:52 AM

ఇప్పటివరకు నగరాలు,పట్టణాల్లో మాత్రమే చూసిన పాత భవనాల ఎత్తును పెంచే టెక్నాలజీ ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మొదలైంది.. భద్రాచలం ఏజెన్సీ చర్ల లో 45 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాలు ఇప్పుడు రోడ్డుకి దిగువ ప్రాంతంలో ఉంటున్నాయి.. దీనికి కారణం ఐదు పది సంవత్సరాలకు ఓసారి రోడ్లు ఎత్తు పెంచడం కారణంగా గతంలో నిర్మించిన ఇల్లు , బిల్డింగ్స్ రోడ్డు దిగువకు ఉండిపోతున్నాయి. దీంతో వర్షపు నీరు చుట్టూ చేరటంతో ఆయా ఇళ్లలోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. దీంతో కొంతమంది నిపుణులు సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చారు. దీని ద్వారా పిల్లర్ల దిగువన జాకీలు పెట్టి లేపి బిల్డింగ్ ఎత్తును పెంచుతున్నారు.. ఇలా ఇప్పటివరకు అనేక పట్టణాల్లో విజవవంతం అయిన ఈ టెక్నాలజీ ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ సక్సెస్‌ సాధించింది.

ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఈ ప్రక్రియను చేపట్టారు.. చర్ల మండలానికి చెందిన ఆవుల శివప్రసాద్ అనే వ్యక్తి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని తమ పాత భవనానికి సైతం ఇదే టెక్నాలజీని వాడి సుమారు నాలుగు అడుగులు ఎత్తును పెంచారు..అన్ని పిల్లర్లకు జాకీలను ఫీట్‌ చేసి పెట్టి భవనం ఎత్తును పెంచి ఆ మధ్యలో గ్యాప్ ను ఐరన్ ద్వారా పూర్తి చేస్తున్నారు.. ఇప్పుడు ఈ బిల్డింగ్‌ ఎత్తు సుమారు నాలుగు అడుగులు పైన పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…