Health Tips: చలికాలంలో రోజూ ఈ ఆహారాలు తినడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?
చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో జీవక్రియలు కూడా మందగిస్తాయి.. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. మధుమేహం నుండి, మధుమేహ బాధితులు మీరు మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన ఆహారాలను చేర్చుకోవాలి. వాటితో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, మధుమేహం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చు.
మధుమేహం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా వాతావరణం ద్వారా ప్రభావితమవుతాయి. మధుమేహా బాధితులు వారి ఆరోగ్యం పట్ల సరైన సంరక్షణ, నిర్వహణ అవసరం. చలికాలంలో అనేక రకాల పండ్లు, కూరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక చక్కెరను కలిగి ఉన్న అనేక ఆహారాలు ఉన్నాయి. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేసవి, శీతాకాలంలో ఎక్కువగా ప్రభావితమవుతాయి. ఈ సీజన్‌లో మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడే బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా..? చూద్దాం.
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. ఈ వ్యాధి నయం కాదనే విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఆహారం విషయంలో కాస్త శ్రద్ధ పెడితే అదుపులో ఉంటుంది.. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో జీవక్రియలు కూడా మందగిస్తాయి.. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. మధుమేహం నుండి, మధుమేహ బాధితులు మీరు మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన ఆహారాలను చేర్చుకోవాలి. వాటితో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, మధుమేహం వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించవచ్చు.
మిల్లెట్:
చలికాలంలో రాగులతో చేసిన ఆహారాలను ఎక్కువగా మీ ఆహారంలో చేర్చుకోండి. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి మీరు రాగి నుండి రోటీ, లడ్డూ, కిచ్డీ వంటివి తయారు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే మీకు తగినంత ప్రోటీన్ లభిస్తుంది.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు దీనిని తీసుకోవచ్చు. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కావాలంటే టీలో కూడా కలుపుకుని తాగొచ్చు.
ఉసిరి:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉసిరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి, మీరు మీ దినచర్యలో ఒక ఉసిరికాయ తినవచ్చు.
క్యారెట్:
క్యారెట్లు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, మీరు ప్రతిరోజూ క్యారెట్ తినవచ్చు. దీన్ని తినడానికి, మీరు క్యారెట్ జ్యూస్ లేదంటే..సలాడ్‌లో కలుపుకుని తినొచ్చు.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..