Star Anise Benefits: ప్రాణం లేని నరాలకు జీవం పోసే ‘మ్యాజిక్’ మసాలా!..ఇలా వాడితే దివ్యౌషధం..

ఈ అద్భుతమైన మసాలా ఏ వంటకమైనా రుచిగా మార్చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధుల నుండి కాపాడుతుంది. నరాల సమస్యలను తగ్గించడంలో స్టార్ సోంపు బాగా సహాయపడుతుంది. బలహీనమైన నరాల సమస్యను తగ్గిస్తుంది. ఇది సిరల్లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే నరాలను బలపరుస్తుంది. ఇందులో ఉండే..

Star Anise Benefits: ప్రాణం లేని నరాలకు జీవం పోసే 'మ్యాజిక్' మసాలా!..ఇలా వాడితే దివ్యౌషధం..
Star Anise
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 11, 2023 | 6:54 AM

ఈ ఆధునిక కాలంలో మనలో చాలా మంది ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలతో పోరాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో శరీరాన్ని సరిగ్గా చూసుకోకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యలలో నరాల నష్టం కూడా ఉంటుంది. నరాలు బలహీనపడి నిర్జీవంగా మారినప్పుడు, మెదడు  సంబంధిత అనేక అనారోగ్య సమస్యలు మరింత విషమంగా మారే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా, రక్త ప్రసరణ సమస్యలు, రక్తంలో అడ్డంకులు వంటి సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. జీవం లేని నరాలకు జీవం పోయడానికి వంటగదిలో ఉండే కొన్ని సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు. జీవం లేని నరాలకు ప్రాణం పోయడానికి ఏ సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి. వాటిని ఎలా వాడుకోవాలో వివరంగా తెలుసుకుందాం..

నక్షత్రాకారంలో ఉండే నక్షత్ర సోంపు భారతీయ వంటగదికి గర్వకారణం. వేల సంవత్సరాలుగా, ఆసియా ప్రజలు స్టార్ సోంపును సహజ శక్తిని పెంచే సాధనంగా, జీర్ణశయాంతర సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఈ అద్భుతమైన మసాలా ఏ వంటకమైనా రుచిగా మార్చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉన్నందున ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వ్యాధుల నుండి కాపాడుతుంది. నరాల సమస్యలను తగ్గించడంలో స్టార్ సోంపు బాగా సహాయపడుతుంది. బలహీనమైన నరాల సమస్యను తగ్గిస్తుంది. ఇది సిరల్లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే నరాలను బలపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సిరల్లో మంటను తగ్గిస్తాయి. ఇది నరాల అనుసంధానాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.

నరాల బలహీనతను తొలగించడానికి స్టార్ సోంపును ఎలా ఉపయోగించాలి?

ఇవి కూడా చదవండి

మీరు నరాల సమస్యల నుండి బయటపడటానికి స్టార్ సోంపు నీటిని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి ఒక గ్లాసు నీటిలో 1 నుండి 2 స్టార్ సోంపు వేసి, సుమారు 10 నిమిషాలు మరిగించాలి.. ఆ తర్వాత వడకట్టి తేనె వేసుకుని తాగేయాలి.. ఇది నరాల వాపు, బలహీనత నుండి ఉపశమనం కలిగిస్తుంది.

స్టార్ సోంపు పొడి..

నరాల బలహీనత నుండి ఉపశమనం పొందడానికి స్టార్ సోంపును పొడి రూపంలో కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి, మొదట 50 గ్రాముల నుండి 100 గ్రాముల స్టార్ సోంపు తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీ సాయంతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు సలాడ్లు, పప్పులు, కూరగాయలు మొదలైన వాటిపై చల్లుకుని వాడుకొవచ్చు.

తేనె, స్టార్ సోంపు

నరాల సమస్యల నుండి బయటపడటానికి మీరు తేనెతో పాటు స్టార్ సోంపును ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడానికి, 1 చెంచా తేనెను తీసుకుని అందులో స్టార్ సోంపు పొడిని కలిపి గోరువెచ్చని నీటితో త్రాగాలి. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది. శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.

చచ్చుబడిపోయిన నరాలకు ప్రాణం పోయడానికి స్టార్ సోంపును ఉపయోగించడం చాలా ఆరోగ్యకరమైనది. అయితే, సమస్య మరింత తీవ్రంగా ఉన్నవారు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..