మైనర్‌తో ప్రేమాయణం..! ప్రియురాలి ఇంటికి వెళ్లి బలైన యువకుడు..3 గంటల పాటు చిత్రహింసలు పెట్టి..
బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని అతడిని పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాలలేక యువకుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం, అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని తల్లిదండ్రులు, బంధువులు దారుణంగా కొట్టి చంపేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కిరణ్ (18) అనేక యువకుడు తను ప్రేమించిన మైనర్ బాలికను కలుసుకునేందుకు.. ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది.. సమాచారం అందుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకుని యువకుడిని పట్టుకుని చితకబాదారు. యువతి బంధువులు సైతం యువకుడిపై దాడికి దిగారు.. అతడి ప్రైవేట్ పార్ట్స్ లో కారం పోసి కిరాతంగా దాడి చేశారు. దాదాపు గంటసేపు దాడి చేసిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.
అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల మృతుడు కిరణ్, అదే పరిసర ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికకు కొంతకాలంగా సంబంధం ఉంది. ఈ విషయం బాలిక కుటుంబీకులు తెలుసుకుని యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. మరోసారి కలిసి కనిపిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారని తెలిసింది. అయితే కిరణ్ మాత్రం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా రహస్యంగా ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. బుధవారం, బాలిక తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్తూ.. వారు ఇంట్లో లేని సమయంలో తమ ఇంటిపై నిఘా ఉంచాలని ఇరుగుపొరుగు వారిని కోరారు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న కిరణ్ రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. అతను రావడం గమనించిన స్థానికులు వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని అతడిని పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలకు తాలలేక యువకుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాలిక తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అప్పటికిగానీ,మృతుడి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..