Telangana Elections: బీఆర్ఎస్ టు బీఎస్పీ వయా కాంగ్రెస్.. నామినేషన్ వేసిన మధు
పఠాన్ చెరు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. గతంలో విడుదల చేసిన జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి.. చివరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు నీలం మధు ముదిరాజ్. ఇప్పుడు బీఎస్పీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన ఈసారి అక్కడ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. కేసీఆర్ పార్టీని వీడి టికెట్ వస్తుందన్న ఆశతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ లిస్ట్‌లో మధు పేరు రావడంతో పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి.
పఠాన్ చెరు రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. గతంలో విడుదల చేసిన జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి.. చివరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు నీలం మధు ముదిరాజ్. ఇప్పుడు బీఎస్పీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన ఈసారి అక్కడ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. కేసీఆర్ పార్టీని వీడి టికెట్ వస్తుందన్న ఆశతో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ లిస్ట్‌లో మధు పేరు రావడంతో పటాన్ చెరువు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే పార్టీలో టిక్కెట్ కోసం ముందు నుంచీ ప్రయత్నిస్తున్నారు కాటా శ్రీనివాస్ గౌడ్. గతంలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరిన ఆయన అనుచరులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ అండ కూడా కాటా శ్రీనివాస్‌కే ఉన్నాయి. నీలం మధుకి టిక్కెట్ ఇవ్వడాన్ని జగ్గారెడ్డి కూడా వ్యతిరేకించారు. దాంతో కాంగ్రెస్ లిస్టులో పేరున్నప్పటికీ గాంధీభవన్‌లో మాత్రం మధుకు బీఫామ్ ఇవ్వలేదు. చాలా కాలంగా జాప్యం చేస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీ పెద్దలు కూడా నీలం మధును కలుసుకున్నారు. ఆయనతో మంతనాలు జరిపి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. కానీ పటాన్‌చెరు నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకున్నారు మధు. చివరకు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ బీఫామ్ ఇవ్వడానికి అంగీకరించడంతో ఆ పార్టీలో చేరిపోయారు.
గత వారం, పది రోజులుగా పటాన్ చెరు రాజకీయం అంతా నీలం మధు ముదిరాజ్ చుట్టూనే తిరిగింది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మధు.. పటాన్ చెరువు టిక్కెట్ ఆశించాడు. అందుకు బీఆర్ఎస్ అధిష్టానం అంగీకరించలేదు. దాంతో ఇండిపెండెంట్‌గా అయినా ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి పిలుపు రావడంతో పార్టీ మారిపోయారు. జాబితాలో పేరు వచ్చి బీఫామ్ ఇవ్వకపోవడంతో లాంటి పరిస్థితులకు కారణమైంది.
నీలం మధు వైపు కాంగ్రెస్ మొగ్గు చూపడానికి అసలు కారణం.. ఇప్పటికే మధు సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన సామాజిక వర్గం నుంచి మంచి సపోర్ట్, గ్రౌండ్ లెవల్లో ఆయనకు ఉన్న బలం, సర్వేలు అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఎంఆర్ యువసేన పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ యువసేనలో 50 వేల మంది కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నట్లు సమాచారం. అందుకే బీఎస్పీ ఆయనకు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపింది. నేడు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..