Telangana Election: వేములవాడ బీజేపీ టికెట్‌లో బిగ్ ట్విస్ట్.. చివరి క్షణంలో వికాస్ రావుకే బీ-ఫామ్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పంతం నెగ్గించుకున్నారు. చివరి నిమిషంలో తన కొడుకు వికాస్ రావుకు బీ ఫామ్ ఇప్పించుకున్నారు.

Telangana Election: వేములవాడ బీజేపీ టికెట్‌లో బిగ్ ట్విస్ట్.. చివరి క్షణంలో వికాస్ రావుకే బీ-ఫామ్
Thula Uma Vikas Rao
Follow us
G Sampath Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 10, 2023 | 2:24 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నామినేషన్ల సందర్భంగా పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పంతం నెగ్గించుకున్నారు. చివరి నిమిషంలో తన కొడుకు వికాస్ రావుకు బీ ఫామ్ ఇప్పించుకున్నారు. స్థానిక నాయకత్వం మూడు రోజులుగా హైదరబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తీవ్ర నిరసనలు తెలపడంతో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని కాదని, వికాస్ రావుకే టికెట్ ఇచ్చారు.

వేములవాడ బీజేపీలో కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. ఒకే అసెంబ్లీ స్థానానికి ఇద్దరు బీజేపీ నేతలు పోటాపోటీ నామినేషన్లు వేశారు. ముందుకు బీజేపీ అధిష్టానం టికెట్ ప్రకటించడంతో తుల ఉమ నామినేషన్ దాఖలు చేశారు. పోటా పోటీగా ఇద్దరు అభ్యర్థులు బీజేపీ తరఫున నామినేషన్ వేసి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపారు. వికాస్ రావుకు అనుచరులు నామినేషన్ వేసి మద్దతు తెలిపారు. అనూహ్యంగా వికాస్ రావుకు టికెట్ కేటాయించడంతో తుల ఉమ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

వేములవాడ అభ్యర్థి విషయంలో బీజేపీ అధిష్టానం యూ టర్న్ తీసుకుంది. స్థానిక నాయకత్వం అంతా కూడా మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసనలు తెలపడంతో తుల అభ్యర్థిత్వాన్ని కాదని వికాస్ రావుకే టికెట్ ఇచ్చారు. కొద్ది సేపటి క్రితం బీఫామ్ తీసుకుని వేములవాడ పార్టీ శ్రేణులు హైదరాబాద్ నుండి తిరుగు ప్రయాణం అయ్యాయి. భారీ ర్యాలీగా తరలివచ్చిన వికాస్ రావు తన నామినేషన్ దాఖలు చేశారు.

బీజేపీ ఆది నాయకత్వం వాస్తవంగా తెలంగాణాలో వారసులకు టికెట్ ఇవ్వకూడదన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పార్టీ నేతలు ఆ దిశగానే పావులు కదిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ కుటుంబం వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేస్తున్నందున బీజేపీలో వారసులకు అవకాశం ఇవ్వకూడదన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యామని బీజేపీలోని ఓ వర్గం నాయకులు భావించారు. కానీ అనూహ్యంగా వేములవాడ పార్టీ శ్రేణులు పట్టుబట్టి వికాస్ రావుకు టిక్కెట్ ఇప్పించడం లో సక్సెస్ అయ్యారు దీంతో విద్యాసాగర్‌ రావు తనయుడు వికాస్ రావుకు టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం పెద్దలు ఒప్పుకోక తప్పలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..