కులాల కురుక్షేత్రంగా తెలంగాణ దంగల్.. సామాజిక సమీకరణాలనే నమ్ముకున్న ప్రధాన పార్టీలు..
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి ప్రధానపార్టీలు. ముఖ్యంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయ వర్గాలకు దగ్గరయ్యేందుకు సరికొత్త నినాదాలు, విధానాలు ప్రకటిస్తున్నాయి. బీసీలకే సీఎం ఇస్తామని బీజేపీ అంటే... రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అంటోంది. ఎస్సీ వర్గాలను ఆకట్టుకోవడానికి మోదీ రంగంలో దిగితే..
తెలంగాణ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టాయి ప్రధానపార్టీలు. ముఖ్యంగా సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయ వర్గాలకు దగ్గరయ్యేందుకు సరికొత్త నినాదాలు, విధానాలు ప్రకటిస్తున్నాయి. బీసీలకే సీఎం ఇస్తామని బీజేపీ అంటే… రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ అంటోంది. ఎస్సీ వర్గాలను ఆకట్టుకోవడానికి మోదీ రంగంలో దిగితే.. డిక్లరేషన్ల పేరుతో బీసీ, మైనార్టీలకు భారీ వరాలు ప్రకటించింది హస్తం పార్టీ. కాంగ్రెస్, బీజేపీలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఆయా వర్గాలకు డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్ నిన్నమైనార్టీ, ఇవాళ బీసీ డిక్లరేషన్లు విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా వర్గాలకు భారీగానే హామీలు గుప్పించింది పార్టీ. మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామంటోంది హస్తం పార్టీ. కులగణన చేసి బీసీలతో పాటు మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామంటోంది కాంగ్రెస్. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేపట్టి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఇవాళ హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42శాతం ఇస్తామని.. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, లిక్కర్ వ్యాపారంలో కోటాతో పాటు, ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేస్తామంటోంది కాంగ్రెస్…
ఇప్పటికే బీసీ సీఎం నినాదంతో బీజేపీ స్పీడు పెంచింది. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ 23 మందికి మాత్రమే బీసీలకు సీట్లు కేటాయిస్తే 36 మందికి అవకాశం ఇచ్చింది కమలం పార్టీ. ఇక పరేడ్ గ్రౌండ్స్ లో రేపు మాదిగ విశ్వరూప సభ నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు బీజేపీ అగ్రనేతలు కూడా హాజరవుతున్నారు. ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు కీలక ప్రకటన చేయబోతున్నారు. ప్రధాని మోదీ వచ్చి ఎన్ని సభలు, సమావేశాలు పెట్టినా ఒక్కసీటు కూడా బీజేపీ గెలవదంటోంది బీఆర్‌ఎస్. ఇక ఓట్ల కోసం బీసీ, మైనార్టీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతుందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయా వర్గాలకు మైనార్టీ హోదా ఉండగా మళ్లీ కులగణన చేసి కోటా ఇస్తామంటూ డిక్లరేషన్‌లో పెట్టడం ద్వారా కులాల మధ్య పంచాయితీ పెడుతున్నారని మండిపడ్డారు మంత్రి. డిక్లరేషన్‌లో అంశాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి సీట్లు విషయంలో మాట తప్పిన పార్టీలు ఓట్ల వేటలో మాత్రం ఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు రకరకాల వరాలు ఇస్తున్నాయి. అంతేకాదు తెలంగాణ ఎన్నికలను ఓ రకంగా కులాల కురుక్షేత్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుందన్న విమర్శలూ ఉన్నాయి. మరి తెలంగాణలో క్యాస్ట్ ఈక్వేషన్లు పార్టీలకు కలిసొస్తాయా?