Telangana Election: చంద్రబాబు పేరుతో ఫేక్ లెటర్ వైరల్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో వెలువడిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నెట్టింట ఫేక్ లేఖను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Telangana Election: చంద్రబాబు పేరుతో ఫేక్ లెటర్ వైరల్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ
Tdp Complaint To Police Copy
Follow us

|

Updated on: Nov 10, 2023 | 12:55 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో వెలువడిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ లేఖ తెగ వైరల్ అవుతోంది. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. నెట్టింట ఫేక్ లేఖను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ సైబర్‌ డీసీపీ కవితకు కలిసిన టీడీపీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న ఫిర్యాదు చేశారు.తెలుగు దేశం పార్టీ అధినేత పేరుతో లెటర్‌ హెడ్‌తో నకిలీ లేఖను విడుదల చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ అధినేత సూచినట్లు సమాచారం. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్టు, జైలులో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని ఆ పార్టీ భావించింది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు భావించినట్టు సమాచారం. కానీ నకిలీ లేఖతో తమ విధానానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. దీనికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు జ్యోత్స్న. ఈ లేఖను వైఎస్సార్‌సీపీకు చెందిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రచారం చేస్తున్నారని వివరించారు.

సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్న ఫేక్ లెటర్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కుల,మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని మండిపడ్డారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రచారం చేస్తున్న లేఖ ఫేక్ అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సైతం క్లారిటీ ఇచ్చారు. ఈ లేఖపై ఫిర్యాదు చేసేందుకు సీఐడీ ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ట రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఫేక్ లేఖను సృష్టించి నెట్టింట వైరల్ చేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో బిగ్‌ఫైట్
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరో బిగ్‌ఫైట్
దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
దేశంలో 50 అమృత్‌ భారత్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు అదుర్స్
కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..
కొండ పొలంలో కోట్ల ఆదాయం.. అద్భుతాలు సృష్టిస్తున్న రైతు..
గాయంతో కోటి రూపాయల కేకేఆర్‌ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే..
గాయంతో కోటి రూపాయల కేకేఆర్‌ ప్లేయర్ ఔట్.. కట్‌చేస్తే..
యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులు
యాంటీ-వాలెంటైన్స్‌ డేలో నాలుగో రోజు ప్రత్యేకం..! మిస్‌యూ కు బదులు