Google: హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్‌.. గూగుల్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

దేశ, విదేశాలకు చెందిన అనేక కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి మహా నగరాలను కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.

Google: హైదరాబాద్‌లో అతిపెద్ద క్యాంపస్‌.. గూగుల్‌పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు
Anand Mahendra On Google
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2023 | 12:50 PM

ప్రపంచంలోని అతి పెద్ద టెక్ కంపెనీలకు భాగ్యనగరం కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. మైక్రోసాఫ్ట్, ఆపిల్, అమెజాన్ తాజాగా గూగుల్ హైదరాబాద్ మహానగరం వేదికగా తమ సంస్థ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టెక్ దిగ్గజ సంస్థల కార్యకలాపాలను విస్తరించడం కోసం సువిశాలమైన సొంత క్యాంపస్‌లను నిర్మించుకుంటున్నాయి. ప్రపంచంలోనే టాప్ టెన్ టెక్ సంస్థ అయిన గూగుల్ కూడా హైదరాబాద్ మణిహారంలో చేరిపోయింది

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశ, విదేశాలకు చెందిన అనేక కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి మహా నగరాలను కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికా తర్వాత అతి పెద్ద క్యాంపస్ నిర్మాణానికి సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలి నానక్ రామ్ గూడ ను వేదికగా చేసుకొని కార్యకలాపాలను మొదలు పెట్టబోతుంది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని నిర్మించాలని గూగుల్ తీసుకున్న నిర్ణయాన్ని అనంద్ మహేంద్ర ప్రశంసించారు. వాణిజ్య అభివృద్ధికి హైదరాబాద్‌ మంచి వేదిక అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఆఫీస్ నిర్మాణం గురించి గూగుల్ చేసిన ప్రకటనను రీట్వీట్ చేస్తూ ఆనంద్ ఇలా రాసుకొచ్చారు. “ఇది కేవలం ఒక కొత్త బిల్డింగ్ ప్రాజెక్ట్ గురించి వార్తలు కాదు. Google వంటి గ్లోబల్, దిగ్గజ దిగ్గజం US వెలుపల ఒక నిర్దిష్ట దేశంలో తన అతి పెద్ద కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు, అది కేవలం వాణిజ్య వార్తలు మాత్రమే కాదు, ఇది మన దేశ ప్రతిష్ఠ, భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యతకు నిదర్శనం.” దీనికోసం భారత్‌ను ఎంచుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించారు. భవన నిర్మాణం ప్రారంభ వీడియోపై ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించారు.

హైదరాబాద్ మహా నగరంలో రాబోయే Google కార్యాలయం 2026 నాటికి పూర్తవుతుంది. ఇది 3 మిలియన్ చదరపు అడుగుల భారీ దీర్ఘవృత్తాకార నిర్మాణంగా ఉంటుంది. కాలిఫోర్నియాలోని మౌంటెన్‌ వ్యూ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కార్యాలయం ఆ కంపెనీకి అతిపెద్దది కావడం విశేషం. గ్రీన్‌ బిల్డింగ్‌ విధానంలో, అత్యాధునిక నిర్మాణ పద్ధతులతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ డిజైన్‌కు బ్రిటీష్ ఆర్కిటెక్చరల్ సంస్థ, ఆల్‌ఫోర్డ్ హాల్ మోనాఘన్ మోరిస్ (AHMM) నాయకత్వం వహిస్తుంది. క్యాంపస్‌ను మొదట రూ. 1,000 కోట్ల పెట్టుబడితో 2 మిలియన్ చదరపు సౌకర్యంగా ప్లాన్ చేశారు. 2015లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కాలిఫోర్నియాలోని కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…