Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యంమత్తులో తాగుబోతు వీరంగం.. విష సర్పానికి సవాల్‌ విసురుతూ.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూసేయండి..

ఇక్కడ ఓ తాగుబోతు పామును మెడలో వేసుకుని ఆడుకుంటున్నాడు. అంతే కాకుండా నేను మహాదేవుని అవతారాన్ని అని పాముతో పదే పదే చెబుతున్నాడు. నన్ను కాటువేయ్‌ అంటూ దాని వెంటపడుతున్నాడు. అది విషనాగు..అతన్ని ఎందుకు విడిచిపెడుతుంది.. తాగి ఉన్నాడని తనకేం తెలుసు.. చిర్రెత్తిపోయిన ఆ పాము తాగుబోతు ఒంటిపై కాటువేసింది. దీంతో పాపం తాగుబోతు.. ప్రాణాలు విడిచిపెట్టాడు.

మద్యంమత్తులో తాగుబోతు వీరంగం.. విష సర్పానికి సవాల్‌ విసురుతూ.. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూసేయండి..
Drunken man played with snake
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2023 | 1:27 PM

నేటి బిజీ ప్రపంచంలో మనం సామాజిక మాధ్యమాలతో ముడిపడి జీవిస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది. ప్రజలు ఇప్పుడు డ్రగ్స్ బానిసల మాదిరిగానే ఇంటర్నెట్‌కు బానిసలయ్యారు. ఎందుకంటే ఇక్కడ మనం చాలా విభిన్న విషయాల గురించి తెలుసుకుంటాం. అలాగే ఇక్కడ షేర్ చేయబడిన వార్తలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక వార్తలు, సమాచారాన్ని అందిస్తాయి. ఇంతకీ ఇక్కడ మనం చెప్పుకోబోయే అసలు విషయం ఏంటంటే.. ఇది కొన్ని సరదా విషయాలతో పాటు చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలకు ప్రత్యేక అభిమానుల సంఖ్య ఉంటుంది. ముఖ్యంగా పాముల వీడియోకు ఎప్పుడూ ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది.

పాములు నిస్సందేహంగా ఇంటర్నెట్‌ హీరోలని చెప్పాలి. పాము వీడియోలపై నెటిజన్లు ఎప్పటినుంచో ఎక్కువగా లైక్‌ చేస్తుంటారు. ఎక్కువ వ్యూస్‌ కూడా పాముల వీడియోలకే వస్తుంటాయి. మానవులను ఎక్కువగా ఆకర్షించిన జీవులలో పాములు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జీవులలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ, వాటిపై ప్రజల్లో ఉన్న ఇష్టం మాత్రం తగ్గదు. కొన్ని సంప్రదాయాలలో పాములను దేవతలుగా కూడా పూజిస్తారు. వీటి గురించి అనేక కథలు, జానపద కథలు ఉన్నాయి. ఈ విషయాలపై మనకు ఇంకా ఆసక్తి ఉండడం సహజం. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా షేర్ అవుతున్నాయి. తాజాగా ఓ పాము వీడియో ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. ఇక్కడ ఓ తాగుబోతు పామును మెడలో వేసుకుని ఆడుకుంటున్నాడు. అంతే కాకుండా నేను మహాదేవుని అవతారాన్ని అని పాముతో పదే పదే చెబుతున్నాడు. నన్ను కాటువేయ్‌ అంటూ దాని వెంటపడుతున్నాడు. అది విషనాగు..అతన్ని ఎందుకు విడిచిపెడుతుంది.. తాగి ఉన్నాడని తనకేం తెలుసు.. చిర్రెత్తిపోయిన ఆ పాము తాగుబోతు ఒంటిపై కాటువేసింది. దీంతో పాపం తాగుబోతు.. ప్రాణాలు విడిచిపెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ ఘటన గత శనివారం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చనిపోయే ముందు తీసిన ఈ వీడియోలో రోహిత్ జైస్వాల్ అనే యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. పామును గట్టిగా పట్టుకుని చేత్తో కొట్టడం కూడా కనిపిస్తుంది. మరి కొన్ని సార్లు పాము తన చేతిని, నాలుకను కొరుకుతానంటూ టెంప్ట్ చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇంతలో పాము కాటుకు గురై యువకుడు మృతి చెందాడు.

మృతుడు రోహిత్ 6 మంది తోబుట్టువులలో చివరివాడు. అతని బావ ఇంట్లో ఉంటున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారడమే కాకుండా, చాలా మంది యువకుడిపై తీవ్ర విమర్శలు చేస్తూ రీపోస్ట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..