Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits For Bad Cholesterol: చలికాలంలో గుండె సమస్యలు నివారించాలంటే ఈ పండ్లు తప్పక తినాలి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడం కూడా చాలా అవసరం. లేదంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభిస్తే, అప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. మన శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే..

Fruits For Bad Cholesterol: చలికాలంలో గుండె సమస్యలు నివారించాలంటే ఈ పండ్లు తప్పక తినాలి
Fruits For Bad Cholesterol
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 10, 2023 | 9:21 PM

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే, క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. అలాగే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయడం కూడా చాలా అవసరం. లేదంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ప్రారంభిస్తే, అప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. మన శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రారంభిస్తే అనేక శారీరక సమస్యలకు దారితీస్తుంది. రక్త ప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాలు, స్వీట్లు, మటన్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చలికాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కొన్ని పండ్లను తప్పనిసరిగా తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే..

నిమ్మకాయ.. చలికాలంలో రోజూ ఏదైనా సిట్రస్‌ పండు తినాలి. ఈ సమయంలో మార్కెట్లో చాలా నారింజ, ముసాంబి అందుబాటులో ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఏదైనా పండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజూ ఈ పండ్లలో ఏదో ఒకటి తినాలి. శీతాకాలంలో మధ్యాహ్నం పూట నారింజ తినగలిగితే ఇంకా మంచిది.

యాపిల్స్.. చలికాలంలో యాపిల్స్ అధికంగా లభిస్తాయి. క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. ఎందుకంటే యాపిల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఆపిల్ పీల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆపిల్ పీల్స్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడే ఫైబర్ కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ.. పుచ్చకాయ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. పుచ్చకాయ ధమనులను శుభ్రపరుస్తుంది. ఈ పండులో ఫైబర్, విటమిన్లు, లైకోపీన్ వంటి మినరల్స్‌ చాలా ఉన్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలను నివారిస్తుంది.

ఎర్ర ద్రాక్ష.. ఎర్ర ద్రాక్షలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను దూరం చేస్తాయి. పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్ రెస్వెరాట్రాల్ సమ్మేళనం ద్రాక్ష తొక్కల్లో ఉంటుంది. ఇది LDL పెరగకుండా నిరోధిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తా కథనాల కోసం క్లిక్ చేయండి.