AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remedies for Sore Throat: చలి కాలంలో గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు మీకోసమే!

ఇతర కాలాలతో పోల్చితే చలి కాలంలో ఇన్ ఫెక్షన్లు, జ్వరం, తల నొప్పి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటికి ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. అలాగే శీతా కాలంలో గొంతు నొప్పి అనేది కూడా సర్వ సాధారణం. కూలింగ్ వాటర్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తింటే వెంటనే గొంతు నొప్పి వచ్చేస్తుంది. దీంతో ఇతర ఆహార పదార్థాలను ఏమీ తినలేం. మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. గొంతులోని ఇన్ ఫెక్షన్ కారణంగా సూక్ష్మ క్రిములు చేరడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి కారణంగా..

Remedies for Sore Throat: చలి కాలంలో గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు మీకోసమే!
Sore Throat
Chinni Enni
| Edited By: |

Updated on: Nov 11, 2023 | 9:59 PM

Share

ఇతర కాలాలతో పోల్చితే చలి కాలంలో ఇన్ ఫెక్షన్లు, జ్వరం, తల నొప్పి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటికి ఎక్కువగా ఎటాక్ చేస్తాయి. అలాగే శీతా కాలంలో గొంతు నొప్పి అనేది కూడా సర్వ సాధారణం. కూలింగ్ వాటర్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తింటే వెంటనే గొంతు నొప్పి వచ్చేస్తుంది. దీంతో ఇతర ఆహార పదార్థాలను ఏమీ తినలేం. మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. గొంతులోని ఇన్ ఫెక్షన్ కారణంగా సూక్ష్మ క్రిములు చేరడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. గొంతు నొప్పి కారణంగా జ్వరం కూడా వస్తుంది. ఒక్కోసారి ట్యాబ్లెట్స్ వేసుకున్నా పని చేయదు. ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఇంట్లోని కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల వీటికి చెక్ పెట్టవచ్చదు. అవేంటో చూద్దాం.

గోరు వెచ్చటి నీరు:

మీకు ఎప్పుడైతే గొంతు నొప్పిగా అనిపిస్తుందో.. అప్పుడు వేడి నీటిని గొంతులో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి మటుమాయం అవుతుంది.

ఇవి కూడా చదవండి

గోరు వెచ్చటి నీరు – ఉప్పు:

గొంతు నొప్పి ఉన్నప్పుడు.. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా పుక్కిలించాలి. ఇలా గొంతు నొప్పి తగ్గేదాకా చేయవచ్చు. ఇలా చేసినా గొంతు నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు.

పసుపు:

పసుపు యాంటీ బయోటిక్ అన్న విషయం మనకు తెలిసిందే. చలి కాలంలో గొంతు నొప్పి వచ్చినప్పుడు.. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా పసుపు వేసి బాగా పుక్కిలించాలి. గొంతు దగ్గర ఓ నిమిషం పాటు పసుపు కలిపిన వాటర్ ని అలానే ఉంచాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాలి. త్వరలోనే గొంతు నొప్పి నుంచి రిలీఫ్ నెస్ వస్తుంది.

అల్లం టీ:

అల్లం టీతో కూడా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. అలాగే గొంతు ఇన్ ఫెక్షన్ ను కూడా దూరం చేసుకోవచ్చు. అల్లం ఘాటుకు గొంతులోని ఇన్ ఫెక్షన్ దూరం అవుతుంది.

మిరియాల పాలు:

గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మిరియాల పాలు తాగితే అద్భుతంగా పని చేస్తాయి. గొంతులోని ఇన్ ఫెక్షన్ ఉన్నా పోతుంది.

తేనె – నిమ్మ రసం:

గొంతు నొప్పిగా ఉన్నప్పుడు గోరు వెచ్చటి నీటిలో తేనె, నిమ్మ రసం కలుపుకుని తాగితే మంచి రిలీఫ్ గా ఉంటుంది. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. గొంతులో ఏమైనా ఇన్ ఫెక్షన్ ఉంటే తగ్గితుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

Follow Us
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్..
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? రోజుకు జీతం ఎంతంటే?
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
భగ్గుమంటున్న ఎండలు.. చెట్లపైనే కాలి రాలిపోయిన మూగజీవాలు.. పండ్లల
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
ఒక్కరిద్దరు కాదు ఏకంగా ఐదుగురు ప్లేయర్లకు హ్యాండివ్వనున్న ఢిల్లీ
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
మొదటిసారి గృహ రుణం తీసుకుంటున్నారా? ఈ కీలక విషయాలు తెలుసుకోండి..!
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
గరం మసాలాను డ్రగ్స్‌గా భావించిన అధికారులు.. అతనికి 57 రోజుల జైలు
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..
డాలర్ ఢమాల్..! ప్రపంచ దేశాలకు రాబర్ట్ కియోసాకి వార్నింగ్..
దేశంలోనే తొలిసారి.. ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్ ప్రారంభం
దేశంలోనే తొలిసారి.. ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ యాప్ ప్రారంభం
గాలివానకు టోల్‌గేట్ హాంఫట్..
గాలివానకు టోల్‌గేట్ హాంఫట్..
ఎండల్లో లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా నీరసం తగ్గట్లేదా..
ఎండల్లో లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా నీరసం తగ్గట్లేదా..