Poha Sweet: అటుకులతో అప్పటికప్పుడు ఈ ప్రసాదాన్ని పదే నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు!
దేవుడికి ప్రసాదాలు చేయాలంటే.. ఉదయాన్నే కాస్త హడావిడిగా ఉంటుంది. స్కూల్, ఆఫీసులు ఇలా చాలా సందడిగా ఉంటుంది. అంత ఉదయాన్నే త్వరగా ప్రసాదాలు చేయాలంటే చాలా కష్టం. అందులోనూ స్నానం చేశాక చేయాలి. మరోవైపు ఆఫీసులకు లేట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఇలా ఫాస్ట్ గా అయ్యే ప్రసాదాన్ని ట్రై చేయండి. అదేంటి? అనుకుంటున్నారా.. అటుకుల స్వీట్. పోహాతో ఎలాంటి ఐటెమ్ చేసినా రుచిగా, హెల్దీగా ఉంటుంది. అంతే కాదు ఫాస్ట్ గా కూడా..
దేవుడికి ప్రసాదాలు చేయాలంటే.. ఉదయాన్నే కాస్త హడావిడిగా ఉంటుంది. స్కూల్, ఆఫీసులు ఇలా చాలా సందడిగా ఉంటుంది. అంత ఉదయాన్నే త్వరగా ప్రసాదాలు చేయాలంటే చాలా కష్టం. అందులోనూ స్నానం చేశాక చేయాలి. మరోవైపు ఆఫీసులకు లేట్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో ఇలా ఫాస్ట్ గా అయ్యే ప్రసాదాన్ని ట్రై చేయండి. అదేంటి? అనుకుంటున్నారా.. అటుకుల స్వీట్. పోహాతో ఎలాంటి ఐటెమ్ చేసినా రుచిగా, హెల్దీగా ఉంటుంది. అంతే కాదు ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్రసాదం కూడా త్వరగా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా చేయవచ్చు. మరి ఈ ఇన్ స్టెంట్ పోహా స్వీట్ ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల స్వీట్ కి కావాల్సిన పదార్థాలు:
అటుకులు, బెల్లం లేదా పంచదార, డ్రై ఫ్రైట్స్, ఎండు కొబ్బరి తరుగు, యాలకుల పొడి.
అటుకుల స్వీట్ తయారీ విధానం:
ఈ స్వీట్ ని చాలా తక్కువ సమయంలో.. తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా అటుకులను శుభ్రంగా ఒకసారి కడిగి నీటిలో వేసి వెంటనే పిండి తీసేయాలి. మరోవైపు బెల్లం వేయాలనుకునే వారు బెల్లాన్ని తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో బెల్లం తురుము లేదా పంచదార, నీళ్లు వేసుకుని వేడి చేయాలి.
బెల్లం కరిగి నురగ వచ్చేలా ఉడుకుతున్నప్పుడు.. యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. తర్వాత నాన బెట్టిన అటుకులు వేసి కలుపుకోవాలి. బెల్లం అటుకులకు బాగా పట్టి పొడి బారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. కావాలనుకున్న వారు డ్రై ఫ్రైట్స్ ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల స్వీట్ సిద్ధమవుతుంది. ఈ ప్రసాదం చేయడానికి ఎంతో సమయం పట్టదు.