AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla for Hair Care: తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారాలంటే ఈ పండు తింటే సరి.. ఎన్ని లాభాలో..

నేటి జీవన శైలి కారణంగా చాలా మందికి చిన్న తనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. అందులో చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్ధులను మరీ ఎక్కువగా ఈ సమస్య వెంటాడుతుంది. వెంట్రుకలు తెల్లగా మారడం వల్ల వారు నలుగురిలో కలవలేక ఇబ్బందిపడిపోతుంటారు. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలామందికి జుట్టు నెరుస్తుంటుంది. అలాగే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి ప్రజలు జుట్టుకు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ కలర్స్‌ ఉపయోగిస్తుంటారు. కానీ అది తాత్కాలికంగా మాత్రమే..

Amla for Hair Care: తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారాలంటే ఈ పండు తింటే సరి.. ఎన్ని లాభాలో..
ఆహారం తిన్న త‌ర్వాత ఉసిరిని తింటే జీర్ణ సంబంధ‌మైన స‌మస్య‌లు దూర‌మ‌వుతాయి. ఉసిరిలో అధిక శాతంలో ఏ-విట‌మిన్ కూడా ఉండ‌టం వ‌ల్ల క‌ళ్ల‌కు మేలు జ‌రుగుతుంది. రోజుకి 20 మిల్లిలీటర్ల ఆమ్లా జ్యూస్ లేదా 1-2 టేబుల్ స్పూన్ల ఎండు ఉసిరిని తీసుకోవ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌ల చేత ఉసిరిని తినిపించ‌డం వ‌ల్ల చ‌లికాలంలో వ‌చ్చే జ‌లుబు, ద‌గ్గు లాంటి స‌మ‌స్య‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు.
Srilakshmi C
|

Updated on: Nov 09, 2023 | 9:27 PM

Share

నేటి జీవన శైలి కారణంగా చాలా మందికి చిన్న తనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. అందులో చిన్నపిల్లలు, కాలేజీ విద్యార్ధులను మరీ ఎక్కువగా ఈ సమస్య వెంటాడుతుంది. వెంట్రుకలు తెల్లగా మారడం వల్ల వారు నలుగురిలో కలవలేక ఇబ్బందిపడిపోతుంటారు. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలామందికి జుట్టు నెరుస్తుంటుంది. అలాగే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి ప్రజలు జుట్టుకు మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్‌ కలర్స్‌ ఉపయోగిస్తుంటారు. కానీ అది తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ సమస్యకు దీర్ఘకాల ఉపశమనం కలిగించాలంటే ఉసిరి కాయను వినియోగించాలి. ఉసిరికాయ జుట్టు సంబంధిత సమస్యలకు ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడే లక్షణాలు ఉసిరికాయల్లో పుష్కలంగా ఉంటాయి.

ఉసిరిలో మెలనిన్ పిగ్మెంట్‌ను పెంచడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి. ఈ మెలనిన్ మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఉసిరిలో జింక్, విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. ఇది మీ జుట్టును సహజ పద్ధతుల్లో అందంగా, నల్లగా మారుస్తుంది. అంతేకాకుండా ఇది ఇతర జుట్టు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉసిరి చుండ్రును తొలగిస్తుంది, రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది.

జుట్టు సంబంధిత సమస్యల నివారణ కోసం ఉసిరిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది, ఉసిరి రసం త్రాగవచ్చు. లేదంటే ఉసిరితో స్వీట్స్‌ తయారు చేసి తినవచ్చు. అలాగే రెండవ మార్గం ఏంటంటే.. జుట్టుకు ఉసిరి రసాన్ని వినియోగించాలి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి ఉసిరికాయను తీసుకోవడం వల్ల జుట్టుకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందనే విషయం మీకు అవగతం అయ్యి ఉంటుంది. ఉసిరికాయ మీ జుట్టుకు ఇతర మేలు కూడా చేస్తుంది. ఉసిరి మీ జుట్టును బలంగా, మృదువుగా, సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది. చాలా మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. ఉసిరి ఈ సమస్యను నివారిస్తుంది. ఉసిరి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఉసిరి జుట్టు సంబంధిత అన్ని సమస్యలను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.