- Telugu News Health Sleeping Tricks: Follow these tips to get back to sleep after waking up in the middle of a nap
Sleeping Tricks: అర్థరాత్రి నిద్ర లేచిన తర్వాత మళ్లీ నిద్ర పట్టడం లేదా ఇలా చేయండి!
ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. ఎంత బాగా నిద్ర పోతే అంత మంచిది. ఒక రోజు తిండి లేకుండా అయినా ఉండొచ్చు ఏమో కానీ.. నిద్ర లేకుండా ఉండటం మాత్రం చాలా కష్టం. ఒక మనిషి రోజూ 8 గంటల నిద్ర చాలా ముఖ్యం. లేదంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కానీ ఈ రోజుల్లో అనేక రకాల ఒత్తిడిల కారణంగా నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా అర్థరాత్రి వరకూ సెల్ ఫోన్లు, టీవీలు చూసుకుంటూ కూర్చోవడం వల్ల..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 11, 2023 | 8:41 PM

Sleeping Tips

ముఖ్యంగా అర్థరాత్రి వరకూ సెల్ ఫోన్లు, టీవీలు చూసుకుంటూ కూర్చోవడం వల్ల నిద్ర హార్మోన్లు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈ విషయం అటు ఉంచితే.. చాలా మందికి నిద్రలో మెళకువ వస్తూ ఉంటుంది. మూత్ర విసర్జన లేదా దాహం వేసి నిద్రలో లేస్తూంటారు. కానీ ఆ తర్వాత చాలా సేపటికి కానీ నిద్ర పట్టదు. అలా ఎప్పటికో తెల్లవారు జామున నిద్ర పడుతుంది.

ఈ సమస్యతో చాలా మంది సతమతమవుతున్నారు. దీంతో నాణ్యమైన నిద్రను కోల్పోతున్నారు. ఇలా మెలకువ వచ్చిన తర్వాత మరలా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అనేక విషయాల గురించి పదే పదే ఆలోచించడం వల్ల మరలా నిద్ర పట్టదని చెబుతున్నారు నిపుణులు.

మళ్లీ నిద్ర త్వరగా పట్టాలంటే.. వచ్చిన ఆలోచనలు ధ్యాస మళ్లించాలి. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసపై దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే ఐదు, పది నిమిషాల్లోనే నిద్ర పడుతుంది. అలాగే కళ్లు మూసుకుని మనసులో అంకెలను లెక్క పెట్టుకోవాలి. ఇలా నిద్ర పట్టేంత వరకూ మనసులో లెక్క పెడుతూ ఉంటే త్వరగా నిద్ర పడుతుంది.

అలాగే నిద్రలో మెలకువ వచ్చి నిద్ర పట్టనప్పుడు.. మనసులోకి ఇతర ఆలోచనలు రాకుండా.. బొట్టు పెట్టుకునే దగ్గర మనసును లగ్నం చేయాలి. ఇలా చేస్తే త్వరగా నిద్ర పడుతుంది. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మళ్లీ త్వరగా నిద్ర పడుతుంది. ఈసారి మీరు కూడా ఈ చిట్కాలను ట్రై చేయండి.





























