AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఆ సమస్యలుండవు.. CBSE పేమెంట్ సమస్యలపై బ్యాంకులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక చర్చలు

సీబీఎస్‌ఈ విద్యార్థులు ఎదుర్కొంటున్న పేమెంట్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. పునఃమూల్యాంకనం, జవాబు పత్రాల కాపీలు వంటి సేవలకు సంబంధించిన చెల్లింపులు సజావుగా జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకురావడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. చెల్లింపు విఫలమైతే ఆటోమేటిక్ రీఫండ్‌లు, రియల్ టైమ్ మానిటరింగ్, వేగవంతమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించారు.

ఇకపై ఆ సమస్యలుండవు.. CBSE పేమెంట్ సమస్యలపై బ్యాంకులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక చర్చలు
Education Minister Dharmendra Pradhan
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2026 | 5:17 PM

Share

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పేమెంట్ గేట్‌వే వ్యవస్థను సమూలంగా మార్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికారులతో చర్చలను ప్రారంభించింది. సీబీఎస్ఈ పేమెంట్ గేట్‌వే వ్యవస్థను సమూలంగా మార్చేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారులతో కూలంకషంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో, ముఖ్యంగా పునఃమూల్యాంకనం, జవాబు పత్రాల ఫోటోకాపీలు పొందడం, ఇతర రుసుము ఆధారిత ప్రక్రియల వంటి పరీక్షానంతర సేవల కోసం పటిష్టమైన, నమ్మకమైన, విద్యార్థి-స్నేహపూర్వక చెల్లింపుల వ్యవస్థ అవసరాన్ని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నొక్కి చెప్పారు.

సకాలంలో లావాదేవీలు జరిగేలా, చెల్లింపులకు సంబంధించిన సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేలా, అధికంగా లేదా విఫలమైన చెల్లింపుల సందర్భాలలో ఆటోమేటిక్ రీఫండ్‌లు అందేలా పటిష్టమైన చెల్లింపుల ప్రోటోకాల్‌లను ఏర్పాటు చేయడంలో సీబీఎస్ఈకి సహకరించాలని ఆయన బ్యాంకులను ఆదేశించారు. అధునాతన సాంకేతిక భద్రతా చర్యలు, రియల్-టైమ్ పర్యవేక్షణ, వేగవంతమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా పేమెంట్ గేట్‌వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సీబీఎస్‌ఈతో కలిసి పనిచేయాలని బ్యాంకులను కోరడం జరిగింది.

భవిష్యత్తులో విద్యార్థులు సాంకేతిక లోపాలు లేదా చెల్లింపు వైఫల్యాలను ఎదుర్కోకుండా ఉండేందుకు, ఈ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతాధికారులను కోరారు. సులభమైన, సురక్షితమైన, సమర్థవంతమైన డిజిటల్ లావాదేవీలను నిర్ధారించాలని ఆయన బ్యాంకులకు పిలుపునిచ్చారు.

సీబీఎస్‌ఈతో సమన్వయంతో, మెరుగైన ప్రోటోకాల్‌లు, సాంకేతిక అప్‌గ్రేడ్‌లను వీలైనంత త్వరగా అమలు చేయడానికి నాలుగు బ్యాంకులు పూర్తి మద్దతు, నిబద్ధతను ప్రకటించాయి.

అంతకుముందు, 2026 మే 24న, సీబీఎస్‌ఈ ఫలితాల అనంతర, పునఃమూల్యాంకన ప్రక్రియల సమయంలో విద్యార్థులు ఎదుర్కొన్న ఇటీవలి చెల్లింపు, సాంకేతిక సమస్యలకు సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చలు జరిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్