Sugarcane Juice Benefits: జుట్టు స్ట్రాంగ్ గా, మెరిసే చర్మం కావాలంటే ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!

సాధారణంగా చెరకు రసం వేసవి కాలంలోనే విరివిగా లభిస్తూ ఉంటుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చెరకు రసాన్ని తాగుతూ ఉంటారు. చెరకు రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు రసం తాగగానే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. లభ్యమైనప్పుడల్లా చెరకు రసం తాగడం చాలా మంచిది. చెరకు రసంతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. చెరకు రసాన్ని చర్మానికి, జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక..

Sugarcane Juice Benefits: జుట్టు స్ట్రాంగ్ గా, మెరిసే చర్మం కావాలంటే ఈ జ్యూస్ తప్పనిసరిగా తాగండి!
Sugarcane Juice
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2023 | 8:50 PM

సాధారణంగా చెరకు రసం వేసవి కాలంలోనే విరివిగా లభిస్తూ ఉంటుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చెరకు రసాన్ని తాగుతూ ఉంటారు. చెరకు రసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు రసం తాగగానే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. లభ్యమైనప్పుడల్లా చెరకు రసం తాగడం చాలా మంచిది. చెరకు రసంతో కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. చెరకు రసాన్ని చర్మానికి, జుట్టుకు అప్లై చేయడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.

చెరకు రసంలో పోషకాలు:

చెరకు రసంలో కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఐరన్, పొటాషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ని యంగ్ గా ఉంచేలా చేస్తాయి. అలాగే స్కిన్ కలర్ కూడా మెరిసేలా చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

చెరకు రసంతో చర్మానికి కలిగే ప్రయోజనాలు:

చెరకు రసాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల నేచురల్ మయిశ్చ రైజర్ గా పని చేస్తుంది. ఇందులో ఉండే గ్లైకోలిక్ యాసిడ్ కంటెంట్.. చర్మం తేమను నిలుపుకోవడానికి, పొడి బార కుండా హైడ్రేట్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ముడతలు రాకుండా కాపాడుతుంది. చెరకు రసాన్ని క్రమం తప్పకుండా చర్మంపై అప్లై చేయడం వల్ల.. ప్యాచెస్ వంటి సమస్యలు పోతాయి. స్కిన్ పై ఉండే అదనపు నూనె ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రాకుండా నిరోధిస్తుంది. చెరకు రసాన్ని తరచూ ఉపయోగించడం వల్ల పింపుల్స్, స్కార్స్ వంటివి ఏమైనా ఉన్నా తొలగి.. చర్మం కాంతి వంతంగా తయారవుతుంది. చర్మంపై మలినాలు, డెడ్ స్కిన్ సెల్స్ వంటి వాటిని ఈజీగా తొలగిస్తుంది.

చెరకు రసంతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు:

అదే విధంగా చెరకు రసాన్ని జుట్టుకు రాయడం వల్ల.. హెయిర్ ని హైడ్రేట్ చేస్తుంది. మంచి కండీషనర్ గా పని చేస్తుంది. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడేవారు చెరకు రసాన్ని తలకు రాసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. చెరకులో ఉండే పోషకాలు జుట్టును బలంగా, స్ట్రాంగ్ గా చేస్తాయి. షైనీగా స్మూత్ గా ఉండే జుట్టు కావాలనుకునే వారు కూడా తలకు చెరకు రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!