Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డయాబెటిస్‌ను శాశ్వతంగా నియంత్రించాలా..? ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి..!

మీరు అల్పాహారంగా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే అది మీ రోజునంతటికి ఇబ్బందిగా మార్చేస్తుంది. ఇక, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవారి విషయానికి వస్తే, వారికి అల్పాహారం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన కొన్ని ఆహారాలు అతి ముఖ్యమైనవి.. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని శాశ్వతంగా నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారంలో తినకూడదని ఆహారాలు..

డయాబెటిస్‌ను శాశ్వతంగా నియంత్రించాలా..? ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి..!
Diabetes
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2023 | 7:05 AM

ప్రతి ఒక్కరికీ ఉదయం అల్పాహారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే..ఆరోగ్యకరమైన జీవితానికి ఆరోగ్యకరమైన బ్రేక్‌ ఫాస్ట్‌ తప్పనిసరి. మనం తినే ఆహారం విషయానికి వస్తే.. ఒక వ్యక్తి అల్పాహారం రాజులా, మధ్యాహ్న భోజనం యువరాజులా, రాత్రి భోజనం బిచ్చగాడిలా తినాలంటుంటారు పెద్దలు.. ఎందుకంటే.. మన అల్పాహారం రోజంతా మనకు కావాల్సిన అన్ని పోషకాలను అందించేదిగా ఉండాలి. అల్పాహారం తర్వాత మనం మరింత శక్తివంతంగా ఉండాలి. మీరు అల్పాహారంగా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే అది మీ రోజునంతటికి ఇబ్బందిగా మార్చేస్తుంది. ఇక, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడేవారి విషయానికి వస్తే, వారికి అల్పాహారం చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాల్సిన కొన్ని ఆహారాలు అతి ముఖ్యమైనవి.. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని శాశ్వతంగా నియంత్రణలో ఉంచుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారంలో తినకూడదని ఆహారాలు..

>> డయాబెటిక్ పేషెంట్లు ఉప్పు ఎక్కువగా తినకూడదు.

ఇవి కూడా చదవండి

>> మధుమేహ వ్యాధిగ్రస్తులు శీతల పానీయాలు కూడా తీసుకోకూడదు.

>> డయాబెటిక్ పేషెంట్ షుగర్, రిఫైన్డ్ షుగర్ తినకూడదు.

>> డయాబెటిక్ పేషెంట్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కూడా తినకూడదు.

>> డయాబెటిక్ పేషెంట్ ఆల్కహాల్ సంబంధిత డ్రింక్స్‌ తీసుకోకూడదు.

ఖాళీ కడుపుతో మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన ఆహారాలు..

వేడి నీళ్లలో నిమ్మరసం మిక్స్ చేసి తాగండి..

డయాబెటిక్‌ బాధితులు ఉదయాన్నే నిమ్మకాయ కలిపి నీటిని తాగటం వల్ల ఫలితం ఉంటుంది. 1 గ్లాస్ వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండుకుని ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని తాగడం వల్ల మన శరీరం డిటాక్సిఫై చేయబడి రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. మీరు బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.

మెంతి నీరు..

1 టేబుల్ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తాగండి..నానబెట్టిన మెంతి గింజలను అలాగే నమిలేయండి..ఇది మీ బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇంకా మీరు దీని నుండి అనేక ప్రయోజనాలను పొందుతారు.

ఉసిరి రసం..

ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి మన పూర్తి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. తగినంత విటమిన్ సి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. అందువల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగాలి.

జీలకర్ర టీ

1 గ్లాసు నీటిలో 1 టీస్పూన్ జీలకర్ర వేసి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఇప్పుడు దీన్ని వడకట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. జీలకర్రలో కొన్ని సహజ పదార్థాలు ఉంటాయి. అవి మన చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర టీ తాగడం వల్ల మన మధుమేహం అదుపులో ఉంటుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
పట్టపగలు కేంద్ర మంత్రి మనుమరాలు దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
నదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్‌!
నదిలో దూకిన మహిళ.. సినిమాను తలపించిన రెస్క్యూ ఆపరేషన్‌!
తెల్లారి స్కూల్ గదిలో కనిపించిన వింత జంతువు.. ఏంటని చూడగా
తెల్లారి స్కూల్ గదిలో కనిపించిన వింత జంతువు.. ఏంటని చూడగా
AP: ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
AP: ఏఐతో రాష్ట్ర ఆదాయం పెండండి! అధికారులతో సీఎం చంద్రబాబు
Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు...
Viral Video: థాయ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన స్కూల్‌ పిల్లలు...
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశా
కొప్పున గులాబీలు..నొదుట పెద్ద బొట్టు..తమన్నా లేటెస్ట్ ఫొటోస్ చూశా
చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
చిల్ బేబీ.. మిర్రర్ ముందు అందంతో అల్లరి చేస్తున్న రవితేజ బ్యూటీ!
ఏం పిల్లరా బాబు.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది..!
ఏం పిల్లరా బాబు.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది..!
శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
శుక్ర, రవులతో మహా యోగాలు.. ఆ రాశులకు పట్టిందల్లా బంగారం..!
ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న ప్లేయర్
ఒక్క మ్యాచ్‌ ఆడకుండానే RCB సక్సెస్‌కు కారణం అవుతున్న ప్లేయర్