Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఈ ఒక్క పండు చాలు.. కొలెస్ట్రాల్, మధుమేహం తగ్గుతాయి…!

ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారికి ఈ పండు అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతుంది. ఇది రక్తంలోని షుగర్‌, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌ చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, గుండె ధమనుల ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ పండు అద్భుత పరిష్కారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Health Tips: ఈ ఒక్క పండు చాలు.. కొలెస్ట్రాల్, మధుమేహం తగ్గుతాయి...!
Cholesterol And Diabetes
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2023 | 7:36 AM

శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మధుమేహం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని మనందరికీ తెలుసు. ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే చెడు కొలెస్ట్రాల్, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అయితే, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని తగ్గించడంలో ఉసిరికాయ అద్భుతంగా సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.. వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారికి ఉసిరికాయను అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. ఉసిరికాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతుంది. ఇది రక్తంలోని షుగర్‌, శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌ చేయడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, గుండె ధమనుల ఆరోగ్యాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉసిరికాయ అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు.

ఉసిరికాయ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు కూడా రెగ్యులర్ గా ఉసిరికాయ తినవచ్చు. ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉసిరి ముక్కలను తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. అందులో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ సి, క్రోమియం ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంచేలా చేస్తాయి. ఉసిరి కాయతో జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకోంటే మంచి ఫలితం ఉంటుంది. అందులో చిటికెడు ప‌సుపు కూడా కలుపుకుని తీసుకుంటే మ‌రింత మంచి ఫ‌లితం ఉంటుంది. ఉసిరి జ్యూస్ శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ర్టాల్ ని తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఆమ్లా పౌడర్ ను తీసుకుంటే చాలు డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు. ఉసిరికాయ శరీరానికి, చర్మానికి మరియు జుట్టుకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు కడుపు నొప్పికి చికిత్స చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఉసిరికాయలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్‌ని పెంచి తద్వారా రక్తహీనతను నివారిస్తుంది. అదనంగా, ఉసిరిలోని విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు మీ కంటిచూపును మెరుగుపరుస్తాయి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఉసిరి కాయలోని కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..