Aloe Vera Facial: ముడతలు పోయి ముఖం మెరిసేలా.. ఈ పచ్చటి మొక్కతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండిలా!

ఈ పచ్చటి మొక్క ఆకుల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్- ఇ చర్మ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలను అందించడంతో పాటు జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరిగేలా చేయడంలో కూడా కలబంద ఎంతగానో సహాయపడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

Aloe Vera Facial: ముడతలు పోయి ముఖం మెరిసేలా.. ఈ పచ్చటి మొక్కతో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండిలా!
Skin Care Tips
Follow us

|

Updated on: Nov 11, 2023 | 8:31 AM

గాడ్జెట్‌లను ఎక్కువగా వాడటం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి అనేక కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్ల మచ్చలు కనిపిస్తాయి. దీనినే డార్క్ సర్కిల్ అని కూడా అంటారు. ఈ డార్క్ సర్కిల్ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. అదనంగా ఇది కొందరిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. మీరు కూడా డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నట్లయితే , మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేదంటే మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములను కొనాల్సిన పనిలేదు. ఇంట్లో పెంచుకునే ఒకే ఒక్క మొక్క సహాయంతో కేవలం కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు మాయమవుతాయి. అది అలోవెరా. అవును, మీ అందరికీ తెలిసినట్లుగా కలబందలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొక్క ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. అలోవెరా మంచి సౌందర్య సాధనం కూడా. అందుకే, అలోవెరా జెల్‌ను బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

అలోవెరా:

అలోవెరాలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను పెంచుతుంది. నల్లటి వలయాలను పోగొట్టుకోవడానికి అలోవెరాను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

కలబంద ఉపయోగాలు:

కలబంద ఒక గొప్ప మాయిశ్చరైజర్. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల అనేక చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు.

అలోవెరా ఫేస్‌ మాస్క్‌:

నల్లటి వలయాలను తగ్గించడానికి అలోవెరా జెల్ ఉపయోగించి ఫేస్ మాస్క్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం అలోవెరా జెల్‌ను రోజ్ వాటర్‌తో కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే ఆశించిన ఫలితాలు వస్తాయి.

రాత్రి పడుకునే ముందు మసాజ్ చేయండి:

రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుని తేలికగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మచ్చలు లేని, మెరిసే మరియు కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.

కలబందలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్- ఇ చర్మ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలను అందించడంతో పాటు జుట్టు ఒత్తుగా , పొడవుగా పెరిగేలా చేయడంలో కూడా కలబంద ఎంతగానో సహాయపడుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై
బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి వచ్చి ఎలుగుబంటి.. ఆపై