Telangana Election: రాజయోగం సిద్దించాలంటూ.. యాగాలు, హోమాలు చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి విజయం దగ్గరి వరకు వచ్చి తృటిలో తేడా కొట్టి ఓటమి పాలు కాక తప్పడం లేడు. హోరా హోరీ పోరులో రెండవ స్థానంతో సరిపెట్టుకోక తప్పడం లేదు. అయితే ఈసారి మాత్రం ఆరు నూరైనా గెలిచి తీరాల్సిందే..! ఓటర్ల దయతో పాటు అమ్మవారి ఆశీస్సులతో విజయం పక్కా చేసుకోవాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేతలు‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు.

Telangana Election: రాజయోగం సిద్దించాలంటూ.. యాగాలు, హోమాలు చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
Mla Candidates Are Performing Yagas And Homams
Follow us
Naresh Gollana

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 12, 2023 | 6:45 PM

జనంలోనే ఉంటున్నారు.. జనంతోనే ఉంటున్నారు.. మాస్ లీడర్స్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. అయినా వారిని అదృష్టం మాత్రం వరించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి విజయం దగ్గరి వరకు వచ్చి తృటిలో తేడా కొట్టి ఓటమి పాలు కాక తప్పడం లేడు. హోరా హోరీ పోరులో రెండవ స్థానంతో సరిపెట్టుకోక తప్పడం లేదు. అయితే ఈసారి మాత్రం ఆరు నూరైనా గెలిచి తీరాల్సిందే..! ఓటర్ల దయతో పాటు అమ్మవారి ఆశీస్సులతో విజయం పక్కా చేసుకోవాల్సిందేనని ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నేతలు‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. రాజయోగం సిద్దించాలంటే రాజశ్యామాల ఆశీస్సులు తప్పక‌ ఉండాలని.. శత్రువు బలం తగ్గి తమ బలం పెంచుకుని ప్రజాఆశీర్వాదంతో గెలిచి నిలవాలని భక్తి‌బావంతో ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, నిర్మల్ అభ్యర్థులు ఆశలన్నీ రాజశ్యామాల మాతపైనే పెట్టుకున్నారు. శత్రువు బలం తగ్గించి తమ బలాన్ని పది రెట్లు పెంచి ప్రజా సేవ చేసేందుకు‌ అవకాశం కోరుతున్నారు. అసెంబ్లీలో ఒక్కసారైనా అద్యక్షా అనేలా ఆశీర్వదించాలని నియమ నిష్టలతో పూజలు చేస్తున్నారు. వరుస ఓటములతో నిరాశకు గురైనా ప్రజాబలం అండగా నిలవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో‌ విజయం సాధించాలని భక్తి భావంతో ముందుకు‌ సాగుతున్నారు.

ఆదిలాబాద్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, మంచిర్యాల నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్ రావు, చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల‌ ఇంద్రకరణ్ రెడ్డి రాజశ్యామాల యాగాన్ని చేపట్టి అమ్మవారి ఆశీస్సులతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్నారు. తాజా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రాజశ్యామాల అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రత్యేక‌పూజలు నిర్వహించారు.

బాల్క సుమన్ సైతం వరుసగా రెండవసారి గెలుపొందాలని ఓటర్లు తమ వైపే నిలిచేలా అమ్మవారి ఆశీస్సులుండాలని‌ ప్రత్యేక పూజలు చేశారు. ఇక పాయల్ శంకర్, ప్రేంసాగర్ రావులు మాత్రం ఈసారి ఎలాగైనా గెలిచి నిలిచి అసెంబ్లీ అద్యక్షా అని నినదించాలని అమ్మవారి ఆశీస్సుల కోసం నియమ నిష్టలతో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యర్థుల బలం తగ్గి తమ ప్రజాబలం మరింతగా పెరిగి ఈసారి భారీ మెజార్టీతో గెలుపొందాలని ఈ నేతలంతా అమ్మవారిని నిష్టతో పూజించారు.

ఇంతకీ రాజశ్యామాల యాగం అంటే ఏంటి.. ఫలితం ఎలా ఉంటుంది అనే కదా..! అందుకు నిదర్శనం కేసీఆర్ విజయాలే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. రాజుల కాలంలో రాజశ్యామల మాత కరుణా కటాక్షాలతో అపజయం అన్నదే లేకుండా రాజులు ముందుకు దూసుకు వెళ్లే వారని చెప్తున్నారు. రాజ్యాలు పోయాయి, రాజరికం పోయిందీ, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులు దక్కాలంటే ప్రజాబలంతో పాటు శత్రువు బలం తగ్గేలా అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి భావంతో కొలవాలని కొందరు నేతలు బలంగా నమ్మడం, ఆ నమ్మకం నిజమవడంతోనే ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ నలుగురు నేతలు రాజశ్యామాల యాగం నిర్వహించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజసూయ యాగం, రాజశ్యామల యాగం ఒకటేనా అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే వేద పండితులు ఆ రెండు యాగాల ఫలితం ఒకటే, అయినా ఈ రెండు యాగాలు వేరు వేరు అంటున్నారు.

రాజసూయ యాగం అంటే శాశ్వత అధికారాన్ని అందించే యాగం అని.. ‘సూయం’ అంటే శాశ్వతం. రాజ్యాన్ని, రాజుని శాశ్వతంగా పాలన‌ సాగించేలా ఆశీస్సులు అంద చేసేది అని చెప్తున్నారు. తమ సార్వభౌమాత్వాన్ని ప్రకటించుకునేందుకు రాజు నుంచి చక్రవర్తిగా మారే క్రమంలో చేసే యాగమే రాజసూయ యాగం అంటున్నారు. రాజసూయ యూగ ఫలితం శత్రువు ఎదురు నిలిచేందుకు కూడా సాహసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని అత్యంత కఠిన నిబద్దతో.. ఏడాది కాలం చేస్తారని, మండల కాలం అంటే 41 రోజులు. అర్థమండలం 21 రోజులు పాటు కూడా చేస్తారని, ఈ యాగం ముగిసిన తర్వాత పూర్ణాహుతి సమర్పించే సమయానికి అక్కడున్న సభలో ఎవరు గొప్పవారైతే వారికి ధానం చేస్తారు. ఫలితంగా యాగం చేసిన వారికి పుణ్యంతో పాటు రాజ్యం శాశ్వతమవుతుందని ప్రతీతి. అయితే రాజ శ్యామల యాగం మాత్రం అర్థమండల కాలం నుండి 3 రోజుల వ్యవధిలో చేసే స్వల్పకాల యాగం అని చెప్తున్నారు వేదపండితులు.

రాజ శ్యామల యాగం చేయడంతో రాజ్యలక్ష్మి వరిస్తుందని, అనుకున్న విజయం దక్కుతుందని, విజేతగా నిలుపుతుందని చెప్తున్నారు వేదపండితులు. రాజశ్యామల యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుందని, రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. అధికారం రావడానికి, శత్రువుల బలం తగ్గడానికి, జన వశీకరణ కోసం ఈ యాగం చేస్తారని పండితులు వెల్లడిస్తున్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికలకు ముందు రాజ శ్యామల యాగం చేసి వరుస ఎన్నికల్లో విజేతగా నిలవడంతో ఆయననే ఆదర్శంగా తీసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ నేతలు‌ ఈ‌సారి ఓటర్ల ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు‌ దండిగా ఉండాలని ఈ‌యాగం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల విజయం తరువాత ఈ నేతలంతా సహస్ర చండీ యాగం చేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని, తమకు కూడా మంచి ఫలితాలు దక్కుతాయని ఈనేతలంతా బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరీ అమ్మవారు ఆశీర్వదించి ఈ నేతలను అసెంబ్లీకి పంపిస్తుందా.. ? నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో జనాన్ని ఈనేతల వైపు నిలిచేలా ఆశీస్సులు అందిస్తుందా.. లేదా? డిసెంబర్ 3 ఫలితాల్లో తేలనుంది. విశ్వాసం ఎన్నటికి ఓటమి చెందదు.. నమ్మకమే మహాబలం..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!