Telangana Election: టికెట్‌ దక్కకపోవడంతో రెబల్‌గా బరిలోకి నేతలు.. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి అగ్రనేతలు

ఎన్నికల్లో కీలక ప్రక్రియ పూర్తైంది. కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో చివరి నిమిషం వరకూ సస్పెన్స్ కొనసాగినప్పటికీ.. బీఫామ్ దక్కిన నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బీఫామ్ అందుకున్న అభ్యర్థులు ఫుల్ జోష్‌లో ఉంటే, టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రెబల్‌గా బరిలోకి దిగారు. ఇదే ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోందట.

Telangana Election: టికెట్‌ దక్కకపోవడంతో రెబల్‌గా బరిలోకి నేతలు.. అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి అగ్రనేతలు
Brs Bjp Congress
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2023 | 10:57 AM

సెలక్షన్ ముగిసింది.. ఇక ఎలక్షన్ మిగిలింది.. నిన్నటితో నామినేషన్లకు గడువు ముగియడంతో ఎన్నికల్లో కీలక ప్రక్రియ పూర్తైంది. కొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో చివరి నిమిషం వరకూ సస్పెన్స్ కొనసాగినప్పటికీ.. బీఫామ్ దక్కిన నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బీఫామ్ అందుకున్న అభ్యర్థులు ఫుల్ జోష్‌లో ఉంటే, టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రెబల్‌గా బరిలోకి దిగారు. ఇదే ప్రధాన పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోందట. ఎందుకంటే రెబల్‌ అభ్యర్థులు తమ ఓట్లను ఎక్కడ చీలుస్తారోనని తెగ టెన్షన్‌ పడిపోతున్నారట.

ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు రెబల్‌ బెడద దడ పుట్టిస్తోంది. పలు స్థానాల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరు పార్టీలు మారితే, మరికొందరు మాత్రం రెబల్‌గా బరిలో దిగి సవాల్‌ విసురుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో పటాన్‌చెరు నుంచి అభ్యర్థిగా నీలం మధు పేరును ముందుకు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో కాట శ్రీనివాస్‌గౌడ్‌ను పేరును అధిష్టానం ఖరారు చేసింది. దాంతో అసంతృప్తికి గురైన నీలం మధు బీఎస్పీ అభ్యర్ధిగా నామినేషన్ వేసి, కాంగ్రెస్ అభ్యర్ధిపై యుద్ధం ప్రకటించారు.

పటాన్‌చెరు స్థాయిలో నారాయణఖేడ్ సీటుపై వివాదం రేగినా తెర వెనుక నుండి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా మంతనాలు జరపడంతో చివరి నిముషంలో అభ్యర్ధిని మార్చింది కాంగ్రెస్‌. సురేష్ షెట్కార్‌ ప్లేసులో సంజీవరెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక వనపర్తి స్థానానికి మొదట తన పేరు ప్రకటించి మూడో జాబితాలో మరొకరికి కేటాయించడంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి రాష్ట్ర నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నూరు నుంచి గడ్డం వివేక్‌ వెంకటస్వామికి టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే వివేక్‌ పార్టీలోకి వచ్చారో ఇక టికెట్‌ రాదనుకున్న బోడ జనార్ధన్.. జాబితాలో పేరు లేదని తేలిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే గులాబీ దండులో చేరారు. ఎన్నికల టైంలో బోడ జనార్దన్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

ఇక శేరిలింగంపల్లి కాంగ్రెస్‌ టికెట్‌‌ను జైపాల్‌, రఘునాథ్‌, సత్యంరావు ఆశించారు. కానీ, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన జగదీశ్వర్‌గౌడ్‌కు టికెట్‌ ఇచ్చింది హైకమాండ్. దాంతో సత్యంరావు రెబల్‌గా తిరుగుబాటు జెండా ఎగుర వేస్తున్నారు. ఇక ఇల్లందులో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు చీమల వెంకటేశ్వర్లు సహా పలువురు బరిలో నిలిచారు. పినపాకలోనూ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా విజయ గాంధీ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అదేవిధంగా సూర్యాపేటలో పటేల్‌ రమేష్‌రెడ్డి, నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్‌ , ఆదిలాబాద్‌లో సంజీవరెడ్డి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇటు బోథ్‌లో వన్నెల అశోక్‌, జుక్కల్‌లో గంగారాం కాంగ్రెస్‌ రెబల్‌గా బరిలో నిలిచారు. సూర్యాపేటలో కాంగ్రెస్‌లో ఐదో జాబితా అక్కడ చిచ్చుపెట్టింది. పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న రమేశ్‌ రెడ్డిని కాదని రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అసమ్మతి జ్వాల రగులుకుంది.

కాంగ్రెస్‌ పార్టీలో ఈ రెబల్స్‌ బెడద గుబులు పుట్టిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు మరో మూడు రోజులే సమయం ఉండటంతో..రెబల్స్‌ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్‌ పార్టీ. ఆ బాధ్యతను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డికి అప్పగించారట. అసంతృప్త నేతలతో మాట్లాడి, రెబల్‌ బెడద లేకుండా చేసేలా కాంగ్రెస్‌ కసరత్తు ప్రారంభించింది.

ప్రధానంగా బీజేపీకి చెందిన తుల ఉమ వేములవాడ నుంచి బరిలో దిగాలని పార్టీ మొదట టికెట్‌ కేటాయించింది. అయితే చివరి నిమిషంలో బీఫామ్‌జీ మహారాష్ట్ర మా గవర్నర్ సీహెచ్‌. విద్యాసాగర్ రావు తనయుడు వికాస్‌రావుకు ఇవ్వడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే వేములవాడ నుంచి పోటీలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ఇక సంగారెడ్డి టికెట్‌ ఆశించిన దేశ్‌పాండేకు చివరి నిమిషంలో పార్టీ బీఫామ్‌ ఇవ్వలేదు. ఇక్కడ పులిమామిడి రాజును అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్‌ ఇవ్వడంతో దేశ్‌పాండే రగిలిపోయారు. ఏకంగా సంగారెడ్డి బీజేపీ ఆఫీసుపై దాడి చేసి నానా హంగామా చేశారు. తనకు టికెట్‌ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ఇక దేవరకద్ర టికెట్‌ను ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కొండా ప్రశాంత్‌రెడ్డికి ఇచ్చింది. దాంతో అక్కడ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎం. బాలకృష్ణ రెబల్‌గా బరిలో దిగారు. ఇక పొత్తులో భాగంగా నాగర్‌ కర్నూలు టికెట్‌ను జనసేనకు కేటాయించింది బీజేపీ. అయితే అక్కడ టికెట్ ఆశించిన కొండ మణెమ్మ రెబల్‌గా బరిలో నిలిచారు. అటు ఆసిఫాబాద్‌లో బీజేపీ రెబల్‌ అభ్యర్థిగా కొట్నాక విజయ్‌ పోటీ చేస్తున్నారు.

ఇటు అధికార పార్టీ బీఆర్ఎస్‌లోనూ అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ అశించి భంగపడ్డ జలగం వెంకటరావు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి మరోసారి ఎన్నికల బరిలోకి రెబల్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. అలంపూర్‌ ప్రేమలత, మధిరలో బొమ్మెర రామ్మూర్తి రెబల్‌గా జెండా ఎగురవేస్తున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మరి ఎన్నికల నాటికి వీరంతా అధిష్టానం మాటకు సర్దుకుంటారా..? రెబల్స్‌గానే బరిలో ఉంటారా..? అన్న చర్చమాత్రం జోరందుకుంది. నామినేషన్లు ఉపసంహరణకు మరో వారం రోజుల టైముంది. ఈ వారం రోజుల్లో ఆయా పార్టీల అధిష్టానాలను రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకుంటాయా..? లేదా..? అన్నది వేచి చూడాలి..! మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..