Telangana Congress: కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై.. త్వరలోనే గులాబీ గూటికి..!

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆపార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారు.

Palvai Sravanthi
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2023 | 10:38 AM

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆపార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నారు. రాత్రి రాత్రే వీరు వారు, వారు వీరు అవుతున్నారు. ఉన్న ఫలంగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఇటీవలె బీజేపీ వీడి కాంగ్రెస్ చేరిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. దీంతో మునుగోడు టికెట్ అశించిన నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు మునుగోడుకు చెందిన చలమల్ల కృష్ణారెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీ వీడటంతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇక స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల పాల్వాయి స్రవంతి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. అయితే, తన పార్టీలో ప్రాధాన్యం తగ్గిందన్న మనస్తాపంతో కాంగ్రెస్ వీడుతున్నట్లు స్రవంతి తెలిపారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!