Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: నామినేషన్‌కు బయలుదేరిన అభ్యర్థి.. రోడ్డు వెంబటి పలకరించిన నల్ల మేకులు.. అంతా షాక్!

పాతబస్తీలో మాత్రం రాజకీయం విచిత్రంగా ఉంది. తెలంగాణకు గుండె అయినటువంటి హైదరాబాద్ టెక్నాలజీ, అభివృద్దిలో రోజు రోజుకు దూసుకుపోతూ ఒక వైపు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. మరోవైపు దానికి పూర్తిగా భిన్నంగా మారింది పాతబస్తీ. తరచూ చిన్నచిన్న గొడవలు జరిగే పాతబస్తీ మరోసారి వార్తల్లోకెక్కింది. పాతబస్తీలో మరోసారి చేతబడి వార్తలు గుప్పుమన్నాయి. ఇవి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది.

Telangana Election: నామినేషన్‌కు బయలుదేరిన అభ్యర్థి.. రోడ్డు వెంబటి పలకరించిన నల్ల మేకులు.. అంతా షాక్!
Hyd Black Magic
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Nov 11, 2023 | 9:28 AM

తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు మరింత హీట్టెక్కుతున్నాయి. అధికార పీఠంమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రజా క్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతూ వారివారి వ్యూహ, ప్రతివ్యూహాలు.. ఎత్తుకు పైఎత్తులతో ముందుకెళ్తున్నాయి. కామెంట్స్, కౌంటర్స్, సవాళ్లు, ప్రతి సవాళ్లతో చలికాలం కాస్తా రాజకీయ వేడితో రంజుగా మారింది. పార్టీల అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, ప్రత్యరోపణలతో విరుచుకుపడుతున్నారు.

అంతా ఒక ఎత్తైతే పాతబస్తీలో మాత్రం రాజకీయం విచిత్రంగా ఉంది. తెలంగాణకు గుండె అయినటువంటి హైదరాబాద్ టెక్నాలజీ, అభివృద్దిలో రోజు రోజుకు దూసుకుపోతూ ఒక వైపు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. మరోవైపు దానికి పూర్తిగా భిన్నంగా మారింది పాతబస్తీ. తరచూ చిన్నచిన్న గొడవలు జరిగే పాతబస్తీ మరోసారి వార్తల్లోకెక్కింది. పాతబస్తీలో మరోసారి చేతబడి వార్తలు గుప్పుమన్నాయి. ఇవి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ చేతబడి ఎన్నికల్లో ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నరన్నా వార్తలు రావడంతో దీనిపై ఒకింతా ఆసక్తిగా నెలకొంది. ఈ విషయం తెలసిన కొందరు స్థానిక నేతలు అందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను చార్మినార్ బీజేపీ అభ్యర్థిగా మేఘన రాణి అగర్వాల్‌‌ను అధిస్టానం ఎంపిక చేసింది. అయితే నామినేషన్ వేయడానికి అంతా సిద్ధం చేసుకుని బయలుదేరిన అమెకు ఆసక్తికర సంఘటన ఎదురైంది. తన కారు వెళ్లే దారిలో రోడ్డుపై ఎక్కవు సంఖ్యలో మేకులు పోసి ఉండటం కనిపించింది. తనను నేరుగా పోటీలో ఎదుర్కోలేక ఇలా అడ్డదారులు తొక్కుతున్నారని, అందులో భాగంగానే చేతబడి ద్వారా కుట్రలు చేస్తున్నారని అరోపించారు మేఘన రాణి. తను నామినేషన్‌లో వేసే దారిలో చేతబడి చేసిన మేకులు వేశారని, తద్వారా వాహనాన్ని పంచర్‌ చేసి నామినేషన్‌ను అడ్డుకోవాలని చూశారని అనుమానం వ్యక్తం చేశారు ఆమె.

ఇదిలావుంటే అలా రోడ్డుపై దారిలో మేకులు చల్లిన అల్లరి మూకలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేప ఇద్దరి అనుమానిత యువకులను అదుపులోకి తీసుకున్నారు. అల్లరి మూకలు కావాలనే చేశారా? నిజంగా లేక బీజేపీ నేత ఆరోపించినట్టు ప్రత్యర్థి నేతల కుట్రలో భాగంగా ఇది జరిగిందా? అనే కోణంలో, మరింత లోతుగా ఇన్విస్టిగేషన్ చేస్తున్నారు భాగ్యనగరం పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…