Telangana: పెళ్లైంది.. భర్తను వదిలేసింది.. చివరకు.. ప్రియుడిని అలా పోడిచావేంటి శిల్ప.. కలెక్టరేట్‌లో కతిపోట్లు..

అదొక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. అక్కడున్న అధికారులు, వస్తూ పోయే వారితో.. కార్యాలయం బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ మొదలైంది. కట్ చేస్తే ఓ మహిళా ఉద్యోగి.. మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేసింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది.. ఈ షాకింగ్ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)పై మండల వ్యవసాయాధికారిణి (ఏవో) కత్తితో దాడి చేసింది. ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: పెళ్లైంది.. భర్తను వదిలేసింది.. చివరకు.. ప్రియుడిని అలా పోడిచావేంటి శిల్ప.. కలెక్టరేట్‌లో కతిపోట్లు..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 11, 2023 | 8:40 AM

అదొక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం.. అక్కడున్న అధికారులు, వస్తూ పోయే వారితో.. కార్యాలయం బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ మొదలైంది. కట్ చేస్తే ఓ మహిళా ఉద్యోగి.. మరో ఉద్యోగిపై కత్తితో దాడి చేసింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది.. ఈ షాకింగ్ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)పై మండల వ్యవసాయాధికారిణి (ఏవో) కత్తితో దాడి చేసింది. ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 నుంచి ఆత్మకూరు (ఎం) మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఎన్‌.శిల్ప పనిచేస్తోంది.. ఇదే మండలం పల్లెపహాడ్‌ వ్యవసాయ విస్తరణాధికారిగా మనోజ్‌ విధులు నిర్వహిస్తున్నాడు.. వీరిద్దరి మధ్య రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, 2012లోనే మరో వ్యక్తితో శిల్పకు వివాహమైంది. రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. రెండేళ్లు శిల్ప భర్తకు దూరంగా ఉంటోంది. అయితే, ఓకే ఆఫీసులో శిల్ప, మనోజ్ పని చేస్తుండటంతో .. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ మొదలైంది.

అయితే, శిల్పతో ప్రేమవ్యవహారం మనోజ్‌ తల్లిదండ్రులకు తెలియడంతో వారు అతడిని మందలించారు. దీంతో మనోజ్‌ ఆమెకు దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఆయన మూడు నెలల క్రితం పల్లెపహాడ్ నుంచి యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు డిప్యూటేషన్‌పై వెళ్లాడు. ఆ తర్వాత రెండు నెలలు సెలవు పెట్టాడు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చాడు. అదే సమయంలో ఏవో శిల్ప తారసపడింది.. మనోజ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాదన మొదలైంది. చూస్తుంగానే వాగ్వాదం కాస్త ఘర్షణగా మారింది. ఇదే సమయంలో శిల్ప తన వెంట తెచ్చుకున్న కత్తితో మనోజ్‌పై దాడి చేసింది. మెడ, వీపు భాగాలపై రెండు పోట్లు పడటంతో మనోజ్‌కు గాయమై.. తీవ్ర రక్తస్రావమైంది. దీంతో తోటి ఉద్యోగులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మనోజ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నానని.. జూన్‌ 7, 2022లో రహస్య వివాహం కూడా చేసుకున్నామని శిల్ప చెప్పింది. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి తనతోనే ఉండాలని మనోజ్‌ ఒత్తిడి చేశాడని.. వెంట బాబును తీసుకువస్తానని చెప్పగా వాడిని చంపేస్తానంటూ బెదిరించాడంటూ పోలీసులకు తెలిపింది. మూడు నెలల నుంచి తనను పట్టించుకోకుండా దూరంగా ఉంటున్నాడని.. కలెక్టరేట్‌‌లో మనోజే తనపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడని.. ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి చేశానంటూ పేర్కొంది.

కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కత్తి ఎవరు తెచ్చారు? ఇద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు. ఏవో శిల్పపై హత్యాయత్నం కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..