AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అన్న బిడ్డకు జన్మనిచ్చిన చెల్లి.. ఆ శిశువుకి అత్తా లేదా తల్లా..? సమాధానం ఏమిటంటే.. 

అమెరికాకు చెందిన 30 ఏళ్ల సబ్రినా హెండర్సన్ కు 33 ఏళ్ల సోదరుడు షేన్ ప్యాటరీ బిడ్డకు జన్మనిచ్చిన అద్దె తల్లి. వాస్తవానికి షేన్ స్వలింగ సంపర్కుడు. పాల్ అనే 37 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. షేన్, పాల్ లు ఓ బిడ్డకు జన్మనివ్వాలని భావించారు. 2020 సంవత్సరంలోనే తల్లిదండ్రులు కావాలని కోరుకున్నారు. ఇద్దరూ ఒకే లింగానికి చెందినవారు కనుక బిడ్డకు జన్మనివ్వడం అనేది సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితిలో సబ్రీనా తన అన్నకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది.

Viral News: అన్న బిడ్డకు జన్మనిచ్చిన చెల్లి.. ఆ శిశువుకి అత్తా లేదా తల్లా..? సమాధానం ఏమిటంటే.. 
Sabreena With Baby TristanImage Credit source: breenahenderson
Surya Kala
| Edited By: TV9 Telugu|

Updated on: Nov 11, 2023 | 12:25 PM

Share

30 ఏళ్ల మహిళ తల్లి కావాలని కోరుకుంది. అయితే విధి ఆడిన వింత నాటకంలో ఆమె తన సొంత సోదరుడి బిడ్డకు తల్లి అయ్యింది. ఇటీవల ఆమె తన సోదరుడి బిడ్డకు జన్మనిచ్చింది. అమ్మనైన తనకు ఈ క్షణం  చాలా ప్రత్యేకమైనదని ఈ మహిళ చెబుతోంది. ఆ మహిళ ఆనందానికి అవధులు లేవు. నిజానికి ఆ మహిళ తన సోదరికి కుటుంబం మరో తరం ముందుకు వెళ్ళడానికి సహాయం చేసింది. సరోగసీ పద్ధతిలో ఆ మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ కథలో ఉన్న మరో ట్విస్ట్ ఏమిటంటే..

డైలీస్టార్ ప్రకారం అమెరికాకు చెందిన 30 ఏళ్ల సబ్రినా హెండర్సన్ కు 33 ఏళ్ల సోదరుడు షేన్ ప్యాటరీ బిడ్డకు జన్మనిచ్చిన అద్దె తల్లి. వాస్తవానికి షేన్ స్వలింగ సంపర్కుడు. పాల్ అనే 37 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. షేన్, పాల్ లు ఓ బిడ్డకు జన్మనివ్వాలని భావించారు. 2020 సంవత్సరంలోనే తల్లిదండ్రులు కావాలని కోరుకున్నారు. ఇద్దరూ ఒకే లింగానికి చెందినవారు కనుక బిడ్డకు జన్మనివ్వడం అనేది సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితిలో సబ్రీనా తన అన్నకు సహాయం చేయడానికి ముందుకొచ్చింది. సరోగసి పద్దతిలో అన్న బిడ్డను తొమ్మిది నెలల పాటు తన కడుపులో మోసి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

 అన్నా చెల్లెల ప్రేమ కథ 

ఇవి కూడా చదవండి

కాలిఫోర్నియాకు చెందిన సబ్రినా వృత్తిరీత్యా ప్రాపర్టీ మేనేజర్. తన అన్నను మనస్ఫూర్తిగా ప్రేమించే ఈ చెల్లి.. అతడి కోసం ఏమి చేయడానికి అయినా తాను సిద్ధమేనని చెబుతోంది. అందుకే తన గర్భంలో అన్న బిడ్డను మోసింది. మళ్ళీ మళ్ళీ తాను ఇలా చేయడానికి రెడీ అని కూడా చెబుతోంది. సబ్రినా మాట్లాడుతూ.. తన కడుపున పుట్టిన ఈ బిడ్డ తనకు అత్యంత ప్రత్యేకమైన మేనల్లుడని చెబుతోంది. సబ్రినా సెప్టెంబరులో బిడ్డకు జన్మనిచ్చింది.. ఇప్పుడు తన సోదరుడు అతని జీవిత భాగస్వామి పాల్‌తో కలిసి నివసిస్తుంది.

సోదరుడికి బిడ్డను అప్పగించిన సబ్రినా

షేన్, పాల్ ఇప్పుడు పరిపూర్ణ తల్లిదండ్రులు అయ్యారని ఆ మహిళ చెప్పింది. సరోగసీ కోసం సబ్రినా అండం  ఉపయోగించారు. అటువంటి పరిస్థితిలో జీవశాస్త్రపరంగా ఈ బిడ్డ మీదే అంటూ చాలా మంది ఆమెకు సోషల్ మీడియాలో చెప్పారు. అయితే బిడ్డను షేన్‌కు అప్పగించినట్లు సబ్రీనా చెబుతోంది.

శిశువుకి సబ్రినా అత్తా లేదా తల్లా..?

సబ్రినా మాట్లాడుతూ తాను పిల్లవాడిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది. అయితే ఈ ప్రేమ అత్త రూపంలో ఉంటుంది. తాను  బిడ్డను తన మేనల్లుడిలా జీవితాంతం ప్రేమిస్తానని వెల్లడించింది. తన సోదరుడికి అవసరమైతే  భవిష్యత్తులో మళ్లీ అద్దె తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నానని సబ్రినా చెబుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..