Israel Hamas War: ఆసుపత్రులను స్థావరంగా మార్చుకున్న హమాస్.. సాక్ష్యం అందించిన ఇజ్రాయిల్

తమ యుద్ధం గాజాలో నివసిస్తున్న పౌరులతో కాదు, హమాస్‌తో అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. హమాస్ యోధులు ఆసుపత్రులను ఉపయోగించడాన్ని తాము అంగీకరించమని ఆసుపత్రులను హమాస్‌ తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగించడాన్ని అరికట్టాలని వెల్లడించింది. ఉత్తర గాజాను ఖాళీ చేయమని ప్రజలను హెచ్చరిస్తూ.. ఇజ్రాయెల్ అన్ని ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు.

Israel Hamas War: ఆసుపత్రులను స్థావరంగా మార్చుకున్న హమాస్.. సాక్ష్యం అందించిన ఇజ్రాయిల్
Israel Hamas War
Follow us
Surya Kala

|

Updated on: Nov 06, 2023 | 8:32 AM

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి హమాస్ యోధులను ఎంపిక చేసి నిర్మూలిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన ట్యాంకులు, యుద్ధ విమానాలు వేగంగా బాంబు దాడులు చేస్తున్నాయి. ఆదివారం కూడా ఇజ్రాయెల్ అనేక ప్రధాన వైమానిక దాడులు నిర్వహించింది. ఇదిలా ఉండగా హమాస్ ఆచూకీకి సంబంధించి ఇజ్రాయెల్ ఒక  సాక్ష్యాన్నిప్రపంచం ముందు ఉంచింది.

IDF ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఇజ్రాయెల్ చేతిలో ఉన్న కొత్త నిఘా, సాక్ష్యాలను వెల్లడించాడు. హమాస్ యోధులు తమ తీవ్రవాద ప్రయోజనాల కోసం గాజా స్ట్రిప్‌లోని ఆసుపత్రులను,  ఆరోగ్య సౌకర్యాలను ఉపయోగిస్తున్నట్లు ఈ వీడియో చూపిస్తుందని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.

ఇవి కూడా చదవండి

గాజా స్ట్రిప్‌లో ఉన్న షేక్ హమద్ హాస్పిటల్ వీడియోను హగారీ విడుదల చేశారు. హమాస్ ఫైటర్లు భూగర్భ సొరంగాల్లోకి ప్రవేశించడానికి ఉపయోగించే భాగాన్ని ఈ వీడియో చూపిస్తుంది. ఆసుపత్రిలో కనిపించే రంధ్రం హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడిందని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. మరొక వీడియోలో  హమాస్ యోధులు ఆసుపత్రి నుండి ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరుపుతున్నట్లు కూడా చూపబడింది. IDF విడుదల చేసిన ఈ వీడియో డ్రోన్ ఉపయోగించి రికార్డ్ చేయబడింది.

అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో IDF ప్రతినిధి రియర్ అడ్మ్. డేనియల్ హగారి కొత్త ఇంటెలిజెన్స్ సమాచారాన్ని, హామాస్ తీవ్రవాద ప్రయోజనాల కోసం గాజా స్ట్రిప్‌లో వైద్య సదుపాయాలను ఉపయోగించినట్లు చూపించే ఆధారాలను వెల్లడించారు.

అండర్‌గ్రౌండ్ ఎంట్రెన్స్‌ను చూపించే వీడియో

మా యుద్ధం హమాస్‌తో, పౌరులతో కాదని చెప్పిన ఇజ్రాయెల్

తమ యుద్ధం గాజాలో నివసిస్తున్న పౌరులతో కాదు, హమాస్‌తో అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. హమాస్ యోధులు ఆసుపత్రులను ఉపయోగించడాన్ని తాము అంగీకరించమని ఆసుపత్రులను హమాస్‌ తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగించడాన్ని అరికట్టాలని వెల్లడించింది. ఉత్తర గాజాను ఖాళీ చేయమని ప్రజలను హెచ్చరిస్తూ.. ఇజ్రాయెల్ అన్ని ప్రయత్నాలు చేసిందని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ దాడిలో కనీసం 40 మంది మృతి

ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆదివారం గాజా స్ట్రిప్‌లోని శరణార్థుల శిబిరంపై దాడి చేశాయి. కనీసం 40 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. గాజా స్ట్రిప్‌లో నివసిస్తున్న పౌరులకు ఉపశమనం కలిగించడానికి కొంతకాలం దాడిని ఆపాలని అమెరికా ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేసింది, అయితే హమాస్ యోధులను అణిచివేసేందుకు తన వంతుగా దాడి కొనసాగుతుందని నెతన్యాహు ప్రభుత్వం చెబుతోంది.

ఇజ్రాయెల్ దాడిలో 9000 మందికి పైగా మృతి

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7 న ప్రారంభమైంది. అప్పుడు హమాస్ మొదట ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసింది. ఇందులో చాలా మంది పౌరులు, IDF సైనికులు మరణించారు. దీని తరువాత, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది.. గాజా స్ట్రిప్‌లో వైమానిక దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో గాజా స్ట్రిప్‌లోని పెద్ద భవనాలు క్షణాల్లో ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటివరకు 9000 మందికి పైగా మరణించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి