Layoffs: మళ్లీ మొదలైన ఉద్యోగుల తొలగింపు.. భారీగా లేఆఫ్స్ ప్రకటించిన దిగ్గజ సంస్థ.
ఆదాయాలు తగ్గుతుండడం, ప్రపంచమంతా మాంద్యం తాలుకూ వాతావరణం కనిపిస్తుండడంతో కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ మొదలు, వీడియో స్ట్రీమింగ్‌తో పాటు మరెన్నో సేవలు అందిస్తున్న ఈ దిగ్గజ కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది...

ఆర్థికమాంద్యం వార్తల నేపథ్యంలో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాదిలో మొదలైన ఉద్యోగుల తొలగింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా మల్టీ నేషనల్ కంపెనీలు మొదలు చిన్న చిన్న స్టార్టప్‌ల వరకు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి.
ఆదాయాలు తగ్గుతుండడం, ప్రపంచమంతా మాంద్యం తాలుకూ వాతావరణం కనిపిస్తుండడంతో కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ మొదలు, వీడియో స్ట్రీమింగ్‌తో పాటు మరెన్నో సేవలు అందిస్తున్న ఈ దిగ్గజ కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. గతేడాది నవంబర్‌లో అమెజాన్ ఏకంగా 18,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మరో 9 వేల మంది తొలగించి అందరినీ షాక్‌కి గురి చేసింది.
ఇప్పటి వరకు అమెజాన్ ఏకంగా 27,000 మందిని ఇంటికి పంపించింది. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈసారి అమెజాన్ మ్యూజిక్ విభాగంలో పనిచేస్తున్న వారికి ఇంటికి సాగనంపనుంది. అమెజాన్‌కు చెందిన ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో పలువురు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ఇందులో భాగంగానే అమెజాన్ మ్యూజిక్ ఎడిటోరియల్, ఆడియో కంటెంట్ టీం సభ్యులకు పింక్ స్లిప్ ఇచ్చినట్లు తెలిపింది.
ఇక ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి కంపెనీ దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటుందని అమెజాన్ ప్రతినిధి తెలిపారని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్‌లో తెలిపారు. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్ మ్యూజిక్ టీంలో ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే అమెజాన్ మ్యూజిక్‌లో పెట్టుబడులు కొనసాగుతాయని అమెజాన్ తెలిపింది. మరి ఈ ఉద్యోగుల తొలగింపు ఇక్కడితో ఆగుతుందా ఇలాగే కొనసాగుతుందా చూడాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..