HCA: భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ కు కాంప్లిమెంటరీ పాసులు లేవు.. జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటకు వారిదే బాధ్యత..HCA అధ్యక్షులు అజరుద్దీన్ కీలక వ్యాఖ్యలు
భారత్- ఆస్టేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయానికి సంబంధించి సికింద్రాబాద్ జింఖాన్ గ్రౌండ్ వద్ద గురువారం జరిగిన తొక్కిసలాటపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షులు అజరుద్దీన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జింఖాన్ గ్రౌండ్..
Cricket: భారత్- ఆస్టేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయానికి సంబంధించి సికింద్రాబాద్ జింఖాన్ గ్రౌండ్ వద్ద గురువారం జరిగిన తొక్కిసలాటపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షులు అజరుద్దీన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జింఖాన్ గ్రౌండ్ వద్ద జరిగిన ఘటన బాధాకరమన్నారు. ఘటనలో గాయపడిన వారి వైద్య ఖర్చులను తామే భరిస్తామని, గాయపడిన బాధితులను తాము చూసుకుంటున్నామని తెలిపారు. ఆన్ లైన్ లో 11,450 టికెట్లను విక్రయించినట్లు తెలిపారు. మ్యాచ్ టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించే కాంట్రాక్టు పేటీఏం సంస్థకు అప్పగించామని, వారు చేసే తప్పులకు తమకు సంబంధం లేదన్నారు. మ్యాచ్ టికెట్లను బ్లాక్ చేశామని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నారు అజరుద్దీన్. తాము ఏ రకమైన టికెట్లను బ్లాక్ చేయలేదని స్పష్టం చేశారు. కాంప్లిమెంటరీ పాసులపై కూడా అజరుద్దీన్ క్లారిటీ ఇచ్చారు. కేవలం 3వేల కార్పోరేట్ టికెట్లు మాత్రమే ఉన్నాయన్నారు. మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద ఏం జరిగిందో పోలీసులకు తెలుసని చెప్పారు.
టికెట్ల విక్రయం విషయంలో గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరిగిందన్నారు. భద్రతకు సంబంధించి పోలీసులు చూసుకోవాలన్నారు. తొక్కిసలాటకు HCA కారణం కాదని, అక్కడ భద్రతను చూసుకోవల్సింది పోలీసులే అని అజరుద్దీన్ తెలిపారు. టికెట్లు బ్లాక్ లో అమ్మితే పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. మ్యాచ్ టికెట్ల విక్రయం విషయంలో HCA నుంచి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..