Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Australia T20: కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం..

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్‌తో టీ20 సిరీస్‌ 1-1 సమం అయింది.

India vs Australia T20: కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్.. ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం..
Rohit Sharma
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 23, 2022 | 11:25 PM

India vs Australia, 2nd T20I Highlights: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్‌తో టీ20 సిరీస్‌ 1-1 సమం అయింది. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యం అయింది. దీంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మాథ్యూ వేడ్ (43 నాటౌట్), ఆరోన్ ఫించ్ (31) రాణించడంతో 90/5 స్కోరు సాధించింది. దీంతో భారత్ 91 పరుగులను లక్ష్యంతో బరిలోకి దిగి సత్తాచాటింది. లక్ష్య ఛేదనలో భారత ఛేజింగ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ (46 నాటౌట్) ముందుండి పోరాడాడు. ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన అతనికి కేఎల్ రాహుల్ (10), విరాట్ కోహ్లీ (11) కొంత సహకారం అందించారు. అనంతరం సూర్యకుమార్ (0) డకౌట్ అవడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (9) రోహిత్‌కు సహకారం అందించాడు. అయితే 7వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను కూడా పెవిలియన్ బాట చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ (2 బంతుల్లో 10 నాటౌట్) ఇన్నింగ్స్ ను పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు అవసరమైన క్రమంలో దినేశ్ కార్తిక్ వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత జట్టు 7.2 ఓవర్లలోనే 92 స్కోరు చేసి ఆరు వికెట్ల తేడాతో ఆసీస్ పై విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడం జంపా మూడు వికెట్లు తీసుకోగా.. ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ విజయంతో మూడు మ్యాచుల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. కాగా, హైదరాబాద్‌ వేదికగా చివరి మ్యాచ్‌ ఆదివారం జరగనుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31) మంచి ఆరంభం అందించేందుకు ప్రయత్నించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ 43 కూడా జత కలవడంతో భారీ స్కోరు చేసింది. అయితే కామెరూన్ గ్రీన్ (5), మ్యాక్స్‌వెల్ (0), టిమ్ డేవిడ్ (2) విఫలమయ్యారు. అయితే హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వేడ్ మూడు సిక్సర్లు కొట్టడంతో ఆస్ట్రేలియా జట్టు 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. చివరి బంతికి స్టీవ్ స్మిత్ (7) రనౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2, బుమ్రా 1 వికెట్ తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..