Neeraj Chopra: నీరజ్ చోప్రాకు ఆనంద్ మహీంద్రా గిఫ్ట్.. ఏం ఇవ్వనున్నాడో తెలుసా..!
బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే బహుమతుల వర్షం కూడా కురుస్తోంది. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఓ గిఫ్ట్‌ను సిద్ధం చేశారు.
Neeraj Chopra: భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నీరజ్ ఫైనల్‌లోనూ సత్తా చాటి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని సాధించి పెట్టాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఫైనల్‌కు చేరుకున్న నీరజ్ అద్భుతం సృష్టించాడు. దీంతో అథ్లెటిక్స్‌లో పతకం కోసం ఎదురు చూస్తోన్న భారత్ 100 ఏళ్ల కల నేడు సాకారమైంది. బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే బహుమతుల వర్షం కూడా కురుస్తోంది. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఓ గిఫ్ట్‌ను సిద్ధం చేశారు. ఈమేరకు ట్విట్టర్లో ఆ బహుమతిని అందిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొత్తగా మార్కెట్‌లోకి రాబోతున్న ఎక్స్‌యూవీ 700 మోడల్ వెహికిల్‌ను నీరజ్ చోప్రాకు బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఈమేరకు ట్విట్టర్లో ‘‘ బాహుబలి.. మేమంతా నీ సైన్యంలోనే ఉన్నాం’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. చేతిలో ఈటెను పట్టుకుని గుర్రంపై వస్తున్న హీరో ప్రభాస్ ఫొటోతోపాటు.. నీరజ్ చోప్రా ఫొటోను ట్విట్టర్లో పంచుకుంటూ పై విధంగా స్పందించారు. రితేశ్ జైన్ అనే వ్యక్తి నీరజ్ చోప్రాకు ఎక్స్‌యూవీ 700 వాహనాన్ని అందించాలని కోరాడు. దీంతో అతని ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. నీరజ్ కోసం ఓ ఎక్స్‌యూవీ 700 మోడల్ వాహనాన్ని రెడీగా ఉంచాలంటూ తమ సంస్థలోని ఉద్యోగులను ఆదేశించాడు. కాగా, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు పలు కంపెనీలు బహుమతులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రజతం సాధించిన ఆనందంలో పిజ్జా తినాలనుందని వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను చెప్పిన వెంటనే.. డొమినోస్ కంపెనీ పిజ్జాలను ఆమె ఇంటికి పంపిన సంగతి తెలిసిందే.
We’re all in your army, Baahubali #NeerajChopra pic.twitter.com/63ToCpX6pn
— anand mahindra (@anandmahindra) August 7, 2021
Yes indeed. It will be my personal privilege & honour to gift our Golden Athlete an XUV 7OO @rajesh664 @vijaynakra Keep one ready for him please. https://t.co/O544iM1KDf
— anand mahindra (@anandmahindra) August 7, 2021
Also Read: Neeraj Chopra: గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ
IND vs ENG: విజయానికి చేరువలో టీమిండియా.. చివరి రోజు లక్ష్యం 157 పరుగులు
Neeraj Chopra: ఒలింపిక్ విజేతలకు బీసీసీఐ బంఫర్ ఆఫర్.. స్వర్ణ పతక వీరుడు నీరజ్ చోప్రాకు రూ. కోటి