Neeraj Chopra: ఒలింపిక్ విజేతలకు బీసీసీఐ బంఫర్ ఆఫర్.. స్వర్ణ పతక వీరుడు నీరజ్ చోప్రాకు రూ. కోటి
టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు బీసీసీఐ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈమేరకు శనివారం సాయంత్రం బీసీసీఐ సెక్రటరీ జైషా సోషల్ మీడియాలో నగదు బహుమతుల వివరాలను వెల్లడించారు.
Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లకు బీసీసీఐ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈమేరకు శనివారం సాయంత్రం బీసీసీఐ సెక్రటరీ జైషా సోషల్ మీడియాలో నగదు బహుమతుల వివరాలను వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఏకైక స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు అదించనున్నట్లు పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో ఫీల్డ్‌లో ఆధిపత్యం చూపిన నీరజ్.. 2008 లో అభినవ్ బింద్రా తర్వాత ఒలింపిక్ క్రీడలలో భారతదేశపు మొదటి వ్యక్తిగత స్వర్ణ పతక విజేతగా నిలిచాడు.
అలాగే రజతం సాధించిన మీరాబాయి చాను, రవి దాహియాకు చెరో అర కోటి ఇవ్వనున్నారు. అలాగే కాంస్య పతకాలు సాధించిన బజరంగ్ పూనియా, లవ్లీనా బార్గోహేన్, పీవీ సింధుకు తలా రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్ల నగదు బహుమతిగా ప్రకటించారు.
INR 1 Cr. – ? medallist @Neeraj_chopra1
50 lakh each – ? medallists @mirabai_chanu & Ravi Kumar Dahiya
25 lakh each – ? medallists @Pvsindhu1, @LovlinaBorgohai, @BajrangPunia
INR 1.25 Cr. – @TheHockeyIndia men’s team @SGanguly99| @ThakurArunS| @ShuklaRajiv
— Jay Shah (@JayShah) August 7, 2021
Our athletes have made the country proud by finishing on the podium at @Tokyo2020. The @BCCI acknowledges their stellar efforts and we are delighted to announce cash prizes for the medallists. pic.twitter.com/1nxST0vURy
— Jay Shah (@JayShah) August 7, 2021
Also Read: IND vs ENG: 303 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. సెంచరీతో ఆకట్టుకున్న జోరూట్.. 5 వికెట్లతో బుమ్రా దూకుడు..
Neeraj Chopra: ఒకప్పుడు ఊబకాయుడు.. ఇప్పుడు వండర్ క్రియేట్ చేసిన వీరుడు.. జయహో నీరజ్
Neeraj Chopra: దేశం నిన్ను చూసి గర్విస్తోంది.. నీరజ్ అద్భుత విజయంపై ప్రముఖులు ఎలా స్పందించారంటే.