Neeraj Chopra: గోల్డ్ విన్నర్‌ నీరజ్ చోప్రాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ

టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీరజ్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Neeraj Chopra: గోల్డ్ విన్నర్‌ నీరజ్ చోప్రాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ
Pm Narendra Modi And Neeraj Chopra
Follow us
Venkata Chari

|

Updated on: Aug 08, 2021 | 12:33 AM

Neeraj Chopra: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నీరజ్‌కు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, భారత ప్రధాని మోడీ ఫోన్ చేసి నీరజ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొంతసేపు ఆయనతో మాట్లాడారు. జావెలిన్ త్రో‌లో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తాడన్న వివ్వాసం ఉందని, అది నిలబెట్టినందుకు భారతదేశం గర్వంగా ఫీలవుతుందని అన్నారు. దేశ కీర్తి పతాకాలను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పినందుకు సంతోషంగా ఉందని ప్రధాని తెలిపారు.

అలాగే నీరజ్‌ చోప్రా అద్భుత విజయంపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ చరిత్రలోనే తొలి మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్.. యావత్ దేశ యువతను ఇన్‌స్పైర్ చేశాడని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆర్మీలో సుబేదార్ కేడర్‌‌లో పని చేస్తున్న నీరజ్ చోప్రాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కంగ్రాట్స్ చెప్పారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. 135 కోట్ల మంది భారతీయులు ప్రపంచ యవనికపై తలెత్తుకొనేటట్లు చేశారని అభినందించారు. ప్రపంచ ఒలింపిక్స్ అద్లెట్స్ లో భారత్ కు ఇది తొలిస్వర్ణం కాగా నీరజ్ చోప్రా మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేళ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు.

Also Read: IND vs ENG: విజయానికి చేరువలో టీమిండియా.. చివరి రోజు లక్ష్యం 157 పరుగులు

Neeraj Chopra: ఒలింపిక్ విజేతలకు బీసీసీఐ బంఫర్ ఆఫర్.. స్వర్ణ పతక వీరుడు నీరజ్‌ చోప్రాకు రూ. కోటి

IND vs ENG: 303 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. సెంచరీతో ఆకట్టుకున్న జోరూట్.. 5 వికెట్లతో బుమ్రా దూకుడు..