IND vs ENG: విజయానికి చేరువలో టీమిండియా.. చివరి రోజు లక్ష్యం 157 పరుగులు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం చివరిరోజు 157 పరుగులు సాధిస్తే 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందడుగు వేసే అవకాశం ఉంది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం చివరిరోజు 157 పరుగులు సాధిస్తే 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ముందడుగు వేసే అవకాశం ఉంది. శనివారం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 52/1తో నిలిచింది. ఓపెనర్ రోహిత్ శర్మ(12), చేతేశ్వర్ పుజారా (12) పరుగులతో క్రీజులో నిలిచారు. ఓపెనర్ కేఎల్ రాహుల్(26; 38 బంతుల్లో 6×4) బ్రాడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
అంతకుముందు ఇంగ్లండ్ 25/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించింది. కెప్టెన్ జో రూట్ (109; 172 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో సామ్‌కరన్ (32;45 బంతుల్లో 4 ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (30; 50 బంతుల్లో 4 ఫోర్లు), డామ్ సిబ్లీ (28; 133 బంతుల్లో 2 ఫోర్లు), డానియెల్ లారెన్స్ (25; 32 బంతుల్లో 4ఫోర్లు) ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా సిరాజ్, శార్ధూల్ చెరో రెండు, షమి ఒక వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ 84 ( 214 బంతుల్లో 12 ఫోర్లు), రవీంద్ర జడేజా 56 ( 86 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. ఇక చివర్లో జస్ప్రిత్ బుమ్రా 28 (34 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ధాటిగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లు పడగొట్టారు.
That’s Stumps on Day 4⃣ of the first #ENGvIND Test!#TeamIndia move to 5⃣2⃣/1⃣ & need 1⃣5⃣7⃣ runs more to win. @ImRo45 (12*) & @cheteshwar1 (12*) will resume the proceedings on Day 5 at Trent Bridge.
Scorecard ? https://t.co/TrX6JMzP9A pic.twitter.com/6yBQ5gAFKO
— BCCI (@BCCI) August 7, 2021
Also Read:Neeraj Chopra: ఒలింపిక్ విజేతలకు బీసీసీఐ బంఫర్ ఆఫర్.. స్వర్ణ పతక వీరుడు నీరజ్ చోప్రాకు రూ. కోటి
IND vs ENG: 303 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్.. సెంచరీతో ఆకట్టుకున్న జోరూట్.. 5 వికెట్లతో బుమ్రా దూకుడు..