Tokyo Olympics 2021 Highlights: ముగిసిన విశ్వ క్రీడలు.. అంగరంగ వైభవంగా సాగిన ఒలింపిక్‌ ముగింపు కార్యక్రమం.

|

Updated on: Aug 08, 2021 | 8:32 PM

Tokyo Olympics 2021 Live Updates: టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. ఈ విశ్వ క్రీడల ముగింపు వేడుకను ఈరోజు సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లాగ్ బేరర్‌గా కాంస్య పతక విజేత బజరంగి పునియా వ్యవహరిస్తారు.

Tokyo Olympics 2021 Highlights: ముగిసిన విశ్వ క్రీడలు.. అంగరంగ వైభవంగా సాగిన ఒలింపిక్‌ ముగింపు కార్యక్రమం.
Tokyo Olympics

Tokyo Olympics 2021 Highlights: విశ్వ క్రీడా మహోత్సవం ముగిసింది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథులు, ప్రేక్షకుల మధ్య వేడుకను వైభవంగా ముగించారు. భారీ బాణసంచా వెలుగులు, నృత్యప్రదర్శనలు, లైట్‌షోతో ఒలింపిక్‌ ఉత్సవాలకు ముగింపు పలికారు. ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికా 113 పతకాలతో మొదటి స్థానంలో నిలవగా 88 పతకాలతో చైనా రెండో స్థానం దక్కించుకుంది. ఇక భారత్‌ 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్‌ చరిత్రలో భారత్‌కు 7 పతకాలు దక్కడం ఇదే తొలిసారి. ఇక తదుపరి ఒలింపిక్స్‌ 2024లో పారిస్‌లో జరగనున్నాయి.

ఇక ఈ వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్‌ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్‌ గురించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్‌ టార్చ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిస్తాయి.

పతకాల వేటలో మనం ఎక్కడ ఉన్నామంటే..

టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ క్రీడా సంబరానికి నేటితో ముగింపు పడింది. ఈసారి జరిగి క్రీడల్లో 113 పతకాలతో అమెరాకి అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో 88 పతకాలతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా 58 పతకాలతో జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ విషయానికొస్తే 7 పతకాలతో 48వ స్థానంలో ఉంది. వీటిలో ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. నీరజ్‌ చోప్రా స్వర్ణం దక్కించుకోగా చాను, రవి దహియాలు రజతం సొంతం చేసుకున్నారు. ఇక పీవీ సింధు, లవ్లీనా, హాకీ జట్టు, భజరంగ్‌ కాంస్య పతకాలు అందుకున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Aug 2021 08:27 PM (IST)

    ముగిసిన విశ్వ క్రీడలు.. అంగరంగ వైభవంగా సాగిన ఒలింపిక్‌ ముగింపు కార్యక్రమం.

    విశ్వ క్రీడా మహోత్సవం ముగిసింది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది అతిథులు, ప్రేక్షకుల మధ్య వేడుకను వైభవంగా ముగించారు. భారీ బాణసంచా వెలుగులు, నృత్యప్రదర్శనలు, లైట్‌షోతో ఒలింపిక్‌ ఉత్సవాలకు ముగింపు పలికారు. ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికా 113 పతకాలతో మొదటి స్థానంలో నిలవగా 88 పతకాలతో చైనా రెండో స్థానం దక్కించుకుంది. ఇక భారత్‌ 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్‌ చరిత్రలో భారత్‌కు 7 పతకాలు దక్కడం ఇదే తొలిసారి. ఇక తదుపరి ఒలింపిక్స్‌ 2024లో పారిస్‌లో జరగనున్నాయి.

  • 08 Aug 2021 07:37 PM (IST)

    ఒలింపిక్స్ విజేతలకు బంపరాఫర్‌ ఇచ్చిన విమానాయన సంస్థలు..

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలను సాధించిన ప్లేయర్స్‌పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికే పలు రకాల నజరానాలను ప్రకటిస్తుండగా, ప్రైవేటు సంస్థలు సైతం ప్లేయర్స్‌కు రివార్డులు ప్రకటిస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ విమానయాన సంస్థ స్టార్‌ ఎయిర్‌ పతకాలు సాధించిన ప్లేయర్స్‌కు జీవితకాలమంతా ఉచితంగా టికెట్లు అందజేస్తామని తెలిపింది. ఇక మరో సంస్థ గో ఫస్ట్‌ ఐదేళ్ల పాటు ఉచితంగా టికెట్లు ఇస్తామని వెల్లడించింది. ఇక దేశానికి స్వర్ణాన్ని సాధించి పెట్టిన నీరజ్‌ చోప్రాకు ఏడాదిపాటు ఉచిత ప్రయాణ సేవలు అందజేస్తామని ఇండిగో సంస్థ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

  • 08 Aug 2021 06:14 PM (IST)

    చివరి రోజు చెలరేగిన అమెరికా.. ఒకే రోజు మూడు స్వర్ణాలు.

    ఒలింపిక్స్‌ చివరి రోజు అమెరికా క్రీడాకారులు చెలరేగారు. చివరి రోజు మూడు బంగారు పతకాలు సాధించారు. ఫైనల్‌ డే జరిగిన మహిళల బాస్కెట్ బాల్ ఫైనల్స్‌లో అమెరికా జట్టు బ్రెజిల్‌పై 3-0తో తిరుగులేని విజయాన్ని సాధించి బంగారు పతకాన్ని సాధించింది. మహిళల బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లోనూ అమెరికా చెలరేగిపోయింది. 90-75తో జపాన్‌ను చిత్తుచేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే, మహిళల ఒమినియమ్‌లోనూ స్వర్ణం సాధించింది. దీంతో ఈసారి ఒలింపిక్స్‌లో అమెరికా 39 స్వర్ణాలు, 41 రజత పతకాలు, 33 కాంస్య పతకాలతో మొత్తం సంఖ్య 113కు చేరింది.

  • 08 Aug 2021 05:54 PM (IST)

    113 పతకాలతో మొదటి స్థానంలో అమెరికా.. మనం ఎక్కడ ఉన్నామంటే..

    టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ క్రీడా సంబరానికి నేటితో ముగింపు పడింది. ఈసారి జరిగి క్రీడల్లో 113 పతకాలతో అమెరాకి అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో 88 పతకాలతో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా 58 పతకాలతో జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది. భారత్‌ విషయానికొస్తే 7 పతకాలతో 48వ స్థానంలో ఉంది. వీటిలో ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. నీరజ్‌ చోప్రా స్వర్ణం దక్కించుకోగా చాను, రవి దహియాలు రజతం సొంతం చేసుకున్నారు. ఇక పీవీ సింధు, లవ్లీనా, హాకీ జట్టు, భజరంగ్‌ కాంస్య పతకాలు అందుకున్నారు.

  • 08 Aug 2021 05:48 PM (IST)

    మొదలైన ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు..

    కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ మొదలైన ఒలింపిక్స్‌ క్రీడలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. జపాన్‌ జాతీయ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. జపాన్‌ జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలయ్యాయి. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్‌ భజరంగ్‌ పునియా భారత బృందం ఫ్లాగ్‌ బేరర్‌గా ఉన్నాడు.

  • 08 Aug 2021 03:43 PM (IST)

    నీరజ్‌కు భారీ రివార్డును ప్రకటించిన బైజూస్‌.. నీరజ్‌తో పాటు.

    ఒలింపిక్స్‌లో ఈసారి పతకాలు సాధించిన ఇండియన్‌ ప్లేయర్స్‌ ప్రశంసలతో పాటు నగదు నజరానా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్స్‌కు భారీ నగదు రివార్డును అందిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు సంస్థలు సైతం రివార్డులను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌కు చెందిన ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ యాప్‌ బైజూస్‌ నీరజ్‌ చోప్రాకు రూ. 2 కోట్ల రివార్డును ప్రకటించింది. అంతేకాకుండా.. మీరాబాయి చాను, రవి కుమార్ దహియా, లోవ్లీనా బోర్గోనైన్, పివి సింధు, బజరంగ్ పునియాలకు రూ. 1 కోటి రూపాయలను ప్రకటించినట్లు తెలిపింది. ఈ విషయమై బైజూస్‌ సీఈఓ బైజు రవీంద్రన్‌ మాట్లాడుతూ.. 'దేశ నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. మేము మా ఒలింపిక్ హీరోలతో కలిసి జరుపుకునే వేడుక సమయం ఇది, 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాదు ప్రతి రోజూ' అని చెప్పుకొచ్చారు.

  • 08 Aug 2021 02:50 PM (IST)

    ఈ ఏడాది నిరాడంబరంగా ముగింపు వేడుకలు..

    టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్‌ క్రీడలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే టోక్యో ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు సాయంత్రం 4.30కి జరగనున్నాయి. కోవిడ్ కారణంగా ముగింపు వేడుకలు నిరాడంబరంగా జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించినరెజ్లర్‌ భజరంగ్‌ పునియా భారత బృందం ఫ్లాగ్‌ బేరర్‌గా ఉండనున్నాడు.

  • 08 Aug 2021 02:47 PM (IST)

    నా కలను నువ్వు సాధించావు.. థ్యాంక్యూ మై సన్‌. నీరజ్‌పై ప్రశంసలు కురింపించిన పీటీ ఉషా.

    ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో స్వర్ణాన్ని సాధించిన దేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్‌పై పరుగుల రాణి పీటీ ఉష ప్రశంసల వర్షం కురిపించారు. నీరజ్‌తో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసిన ఉష.. 'ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకోవాలన్న నా కలను 37 ఏళ్ల తర్వాత నిజం చేశాఉ. థ్యాంక్యూ మై సన్‌' అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే పీటీ ఉష.. 1984 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం సాధించే అవకాశం కోల్పోయింది. ఆ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హార్డిల్స్‌ విభాగంలో పోటీ పడిన ఆమె సెకనులో వందోవంతులో కాంస్య పతకం కోల్పోవాల్సి వచ్చింది.

  • 08 Aug 2021 02:41 PM (IST)

    హాకీ ప్లేయర్‌ సుశీల చానుకు ఘనంగా సన్మానించిన మణిపూర్‌ ప్రభుత్వం..

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఆటతీరుపై అందరూ ప్రశంసలు కురిపించారు. బ్రిటన్‌ చేతిలో 4-3 తేడాతో ఓడిపోయినా వారు చూపిన గేమ్‌ స్పిరిట్ దేశమంతా అండగా నిలిచింది. పతకం గెలవకపోయినా అద్భుతంగా ఆడారంటూ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే హాకీ జట్టులోని మణిపూర్‌కు చెందిన మిడ్‌ఫీల్డర్‌ సుశీల చానును ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. చానుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ నజరానా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సుశీలకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగంతో పాటు రూ. 25 లక్షల నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.

  • 08 Aug 2021 02:36 PM (IST)

    బంగారం గెలిచిన నీరజ్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌..

    వందేళ్ల కలను సాకారం చేసి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నీరజ్‌ చోప్రాకు ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇప్పటికే నీరజ్‌కు పలువురు నజరానాలను ప్రకటిస్తు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ ఐపీఎల్‌ టీమ్‌ నీరజ్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను ఇచ్చింది. ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు గాను రూ. కోటి రివార్డును ప్రకటించింది. అంతేకాకుండా నీరజ్ బల్లెంను విసిరిన 87.58 మీటర్ల దూరానికి సింబల్‌గా ప్రత్యేకంగా 8758 పేరుతో సీఎస్‌కే జెర్సీని రూపొందించి నీరజ్‌కు అందించనున్నట్లు ప్రకటించారు. సీఎస్‌కే జట్టు ఉన్నంతకాలం నీరజ్‌ చోప్రా స్పెషల్‌ జెర్సీ మా గుర్తుగా ఉంటుందని.. అది అతనికి ఇచ్చే గౌరవమని సీఎస్‌కే ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

  • 08 Aug 2021 02:26 PM (IST)

    నీరజ్‌ తర్వాతి టార్గెట్‌ ఏంటో తెలుసా..?

    ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం కంటే పెద్ద కల ఏది ఉండదు. దీని కోసమే ప్రతీ ఒక్క క్రీడాకారుడు కఠోర శ్రమతో ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి అద్భుతాన్ని సాకారం చేసుకొని యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన నీరజ్‌ చోప్రా.. తన తదుపరి లక్ష్యాన్ని ఇప్పుడే ఖరారు చేసుకున్నాడు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని చెబుతున్నాడీ యంగ్‌ ట్యాలెంటెడ్ ప్లేయర్‌. ఈ క్రీడల సన్నద్ధత కోసం లాసాన్నే, పారిస్‌, జూరిచ్‌ జావెలిన్‌ ఫైనల్లో పాల్గొనబోతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఈ ఏడాదే జరగాల్సి ఉండగా టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడి ఈ ఏడాది జరగడంతో వరల్డ్‌ అథ్లెటిక్స్‌ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

  • 08 Aug 2021 02:00 PM (IST)

    నీరజ్ నీ స్వర్ణం.. 2011లో వరల్డ్ కంటే గొప్పదన్న భజ్జీ

    నీరజ్ చోప్రా విజయంపై రాష్ట్రపతి, ప్రధాని ,స్ సినీ సెలబ్రెటీల నుంచి సామాన్యుడి వరకు నీరాజనాలు విసురుతున్నారు. ప్రస్తుతం ఎవరి నోటన విన్నా నీరజ్ నామ జపమే వినిపిస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారత క్రికెట్ జట్టు గెలిచిన 2011 వరల్డ్‌కప్ కన్నా గొప్పదన్నాడు. ఆజతక్ చానెల్ డిబెట్‌లో నీరజ్ చోప్రాను కొనియాడుతూ భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • 08 Aug 2021 12:07 PM (IST)

    పసిడి పతకదారుడిని వినూత్నంగా గౌరవించనున్న సీఎస్‌కే

    చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఒలింపిక్స్ పసిడి పతకదారుడిని వినూత్నంగా గౌరవించింది. ఇప్పటికే కోటి రూపాయలు నజరానా ప్రకటించిన చైన్నై యాజమాన్యం తాజాగా నీరజ్ గౌరవార్ధం కొత్త జెర్సీని రూపొందించడానికి రెడీ అయింది. భారత్ కు బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ని విసిరిన దూరం.. 87:58 మీటర్లు. దీంతో నీరజ్ చోప్రా గౌరవార్ధం.. 8758నెంబర్ తో జెర్సీని రూపొందించనుంది

  • 08 Aug 2021 10:30 AM (IST)

    8 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెటిక్‌కు ఘనమైన వీడ్కోలు

    ప్రపంచంలోని ప్రతిదేశం క్రీడాకారుడి యొక్క కల ఒక్కసారైనా ఒలింపిక్స్ లో తమ దేశం తరపున పాల్గొనాలని..కోరుకుంటాడు. అలాంటిది ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళా వాల్ట్‌ జిమ్నాస్ట్‌ ఒక్సానా చుసోవిటినా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది ఒలింపిక్స్ లో పాల్గొని చరిత్ర సృష్టించింది.1992 బార్సిలోనా ఒలింపిక్స్‌ నుంచి మొదలైన ఆమె ఒలింపిక్స్ జర్నీ 2020 టోక్యో ఒలింపిక్స్‌ తో ముగిసింది. 8 ఒలింపిక్స్‌లో మూడు దేశాల తరపున ఒలింపిక్స్‌ ఆడిన చుసోవిటినా 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకుంది. అత్యధిక ఒలింపిక్స్ లో పాల్గొన్న 46 ఏళ్ల చుసోవిటినా కు టోక్యో ఒలింపిక్స్ లోస్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. స్టేడియంలోని అందరూ నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు. అయితే తనకు గోల్డ్ మెడల్ సాధించలేదనే బాధ ఉందని తెలిపింది ఒక్సానా చుసోవిటినా.

  • 08 Aug 2021 10:14 AM (IST)

    ఏదైనా ఆటగాడికైనా సాల్మన్ చేప ఎందుకు ప్రత్యేకమైనదంటే..

    సాల్మన్ ఫిష్‌లో ప్రోటీన్, ఐరన్, ఫైబర్ లతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి మంచి పోషకారం.. అంతేకాదు కండరాల పునరుద్ధరణకు కూడా సహాయపడుతుంది. ఈ చేపలో రోగ నిరోధక లక్షలు అధికం..

    ఈ చేపలో విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎం ముఖ్యంగా ఇందులో విటమిన్ బి 3, బి 1 పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాలు గుండెకు సంబంధించిన వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

  • 08 Aug 2021 09:48 AM (IST)

    ఇండియన్ ఆర్మీలో మిన్నంటున్న సంబరాలు

    టోక్యో ఒలింపిక్స్ లో భారత్ త్రివర్ణ పతకానికి పసిడి రంగులు అద్దిన నీరజ్ చోప్రా విజయంతో ఆర్మీల సందడి నెలకొంది. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ ను సాధించడంతో సహచర జవాన్లు ఆర్మీ అధికారులు జై భారత మాత అంటూ నినాదాలు చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇండియా ఆర్మీ కి జై అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

  • 08 Aug 2021 09:02 AM (IST)

    నీరజ్ చోప్రాను అభినందించిన పీటీ ఉష

    నీరజ్ చోప్రాను ప్రసిద్ధ స్ప్రింటర్ లో ఒకరైన పీటీ ఉష సోషల్ మీడియా వేదికా అభినందించారు. అంతేకాదు నీరజ్ తో తాను ఉన్న ఫోటోని షేర్ చేసి 37 సంవత్సరాల తర్వాత ఈ రోజు నా కల సాకారం అయ్యింది. థ్యాంక్ యూ మై సన్ నీరజ్ చోప్రా అంటూ.. హ్యాష్ ట్యాగ్ తో టోక్యో 2020 అంటూ ట్వీట్ చేశారు.

  • 08 Aug 2021 08:32 AM (IST)

    బాస్కెట్ బాల్‌లో స్వర్ణం అందుకున్న అమెరికా.. ఒలింపిక్స్‌లో 16వ పసిడి

    టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల బాస్కెట్ బాల్ ఫైనల్లో అమెరికా మళ్ళీ సత్తా చాటింది. అమెరికా 87-82 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరసగా 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో నెగ్గి హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న అమెరికా వరసగా నాలుగోసారి గోల్డ్ మెడల్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ దిశగా మొదటి అడుగు వేసింది. అయితే ఇప్పటి వరకూ ఒలింపిక్స్ లో అమెరికా బాస్కెట్ బాల్ లో 16 వ గోల్డ్ మెడల్. ఇక 1936 నుంచి 68 వరకూ జరిగిన ఒలింపిక్స్ లో వరసగా ఏడూ సార్లు పసిడి విజేతలుగా అమెరికా నిలిచింది.

    Durant takes USA past France for Tokyo Olympics basketball gold | Basketball News | Al Jazeera

  • 08 Aug 2021 08:24 AM (IST)

    జావెలిన్ త్రో ప్రపంచ రికార్డు 98.48 మీటర్లు. ఏ ఏడాదిలో అంటే

    టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్ విభాగంలో భారత్‌ తొలి స్వర్ణాన్ని అందుకుంది. వందేళ్ల చరిత్రలో భారత అథ్లెట్స్‌లో తొలి పతకం సొంతమైంది. జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో అద్భుత ఆటతీరును కనబరిచిన నీరజ్‌ చోప్రా సంచలనం సృష్టించాడు. ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి అద్భుతం చేశాడు. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఒలింపిక్స్ లో పురుషుల జావెలిన్ త్రో ప్రపంచ రికార్డు 98.48 మీటర్లు.  1996 లో జరిగిన ఒలింపిక్స్ లో జాన్ జెలెజ్నీ ఈ రికార్డ్ ను సృష్టించారు.

  • 08 Aug 2021 08:14 AM (IST)

    నెక్ట్ టార్గెట్‌ను నిర్దేశించుకున్న నీరజ్

    టోక్యో ఒలింపిక్స్ ఫైనల్ లో తాను ఒత్తిడికి గురి కాలేదని.. దీనికి కారణం ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడమే కారణమని నీరజ్ చోప్రా చెప్పాడు.. తాను మొదటి సారి త్రో ను 87 మీటర్లు విసరాలని.. ఖచ్చితంగా 87 మీటర్లు తన త్రో దాటుతుందని విశ్వాసంలో ఉన్నానని తెలిపాడు. అయితే ఒలింపిక్స్ జావెలిన్ త్రో రికార్డ్ 90.57 మీట‌ర్లు అని భావించానని.. అయితే తన వ్యక్తిగత బెస్ట్ రికార్డ్ 88.07 మీట‌ర్లని చెప్పాడు. తన నెక్స్ట్ లక్ష్యం 90 మీట‌ర్ల దూరం దాటాల‌ని పెట్టుకున్నట్లు చెప్పాడు.

    ఇక కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా పడి ఈ ఏడాది జరగడం పై కూడా నీరజ్ స్పందించారు. తాను విశ్వ క్రీడలు వాయిదా పడినందుకు నిరాశ పడలేదని.. నెగిటివ్ గా తీసుకోలేదని అన్నారు. అంతేకాదు.. తాను ఇంకా ప్రిపేర కావడానికి మరికొంచెం సమయం దొరికినట్లు ఫీలయ్యానని అన్నాడు.

  • 08 Aug 2021 07:07 AM (IST)

    గోల్డ్ మెడల్‌ను మిల్కా సింగ్‌కు అంకితమిచ్చిన నీరజ్ చోప్రా

    టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 125 ఏళ్ల పసిడి కలను నెరవేర్చిన నీరజ్ చోప్రా పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఒలింపిక్స్ లో శతాబ్దం తర్వాత అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ అందించి సరికొత్త చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా తన గోల్డ్ మెడల్ ను భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్ కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు.

Published On - Aug 08,2021 7:00 AM

Follow us