Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj chopra: భళి..భళిరా బల్లెం వీరా.. నీకు మా బంగారు స్వాగతం.. ఆకాశంలో చక్కర్లు కొట్టేందుకు ఇండిగో ఆఫర్..

బంగారు కొండా...మరుమల్లె దండా....మనసైన అండా నువ్వేరా.. కనుపాప నిండా నీ రూపు నిండా.. మన పతక ధీరా.. నువ్వేరా.. అంటూ యావత్ భారతం పాడుకుంటోది ఆ కుర్రోడ్ని చూసి. టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో చోప్రా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. నీరజ్ వ్యక్తిగత ఒలింపిక్ ఈవెంట్‌లో..

Neeraj chopra: భళి..భళిరా బల్లెం వీరా.. నీకు మా బంగారు స్వాగతం.. ఆకాశంలో చక్కర్లు కొట్టేందుకు ఇండిగో ఆఫర్..
Neeraj Chopra
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 08, 2021 | 7:38 AM

బంగారు కొండా…మరుమల్లె దండా….మనసైన అండా నువ్వేరా.. కనుపాప నిండా నీ రూపు నిండా.. మన పతక ధీరా.. నువ్వేరా.. అంటూ యావత్ భారతం పాడుకుంటోది ఆ కుర్రోడ్ని చూసి. సైనికుడంటే.. బోర్డర్‌లోనే కాదు.. విశ్వవేదికపై భరతమాత కీర్తిని ఘనంగా చాటి చెప్పగలడు అని నిరూపించాడు. మనోడు బరిలో దిగితే ఉంటదీ నా సామిరంగా.. బల్లెం పట్టాడంటే.. మెడలొచ్చి మనోడి మెడలో వచ్చి పడాలంతే. ఇదే తరహాలో దేశం మొత్తం స్వాగతం పలుకుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో బంగారు పతక విజేత నీరజ్ చోప్రాకు ఒక సంవత్సరం పాటు అపరిమిత ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో చోప్రా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. నీరజ్ వ్యక్తిగత ఒలింపిక్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారతీయుడిగా నీరజ్ నిలిచాడు.

“నీరజ్ మీ విజయం గురించి మేమంతా చాలా సంతోషంగా ఉన్నామమంటూ ఇండిగో సిఇఒ రోనోజోయ్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. మీరు దేశం గర్వపడేలా చేసారు. ఇండిగో ఉద్యోగులందరూ మా విమానాల్లో మీకు స్వాగతం పలికినందుకు గౌరవించబడతారని నాకు తెలుసు. అన్ని వినయంతో మేము ఒక సంవత్సరం పాటు ఇండిగో విమానాలలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మీకు అందించాలనుకుంటున్నాము.”

వచ్చే ఏడాది ఆగస్టు 7 వరకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం..

భవిష్యత్తులో భారత అథ్లెట్లకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అద్భుతమైన ప్రదర్శనను చూసి సంబరపడిపోయాము. వచ్చే ఏడాది ఆగస్టు 7 వరకు ఇండిగో విమానాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో తన రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లు విసిరి హర్యానాలోని పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామానికి చెందిన 23 ఏళ్ల రైతు కుమారుడు నీరజ్ చోప్రా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 100 సంవత్సరాలకు పైగా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అథ్లెటిక్స్‌లో భారతదేశం సాధించిన మొదటి ఒలింపిక్ బంగారు పతకం ఇది.

ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.

ఆవి కూడా చదవండి: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు ఆనంద్‌ మహీంద్రా గిఫ్ట్.. ఏం ఇవ్వనున్నాడో తెలుసా..!

Neeraj Chopra: గోల్డ్ విన్నర్‌ నీరజ్ చోప్రాతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ