Neeraj Chopra-Milkha Singh: స్వర్ణ పతకాన్ని దిగ్గజ క్రీడాకారుడు మిల్కా సింగ్‌కు అంకితమిచ్చిన నీరజ్ చోప్రా
Neeraj Chopra-Milkha Singh: టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త అధ్యయనం లిఖించాడు. శతాబ్దం నుంచి అథ్లెటిక్స్‌లో పసిడి కోసం ఎదురు చూస్తున్న..
Neeraj Chopra-Milkha Singh: టోక్యో ఒలింపిక్స్ లో భారత యువ క్రీడాకారుడు నీరజ్ చోప్రా సరికొత్త అధ్యయనం లిఖించాడు. శతాబ్దం నుంచి అథ్లెటిక్స్‌లో పసిడి కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలను నెరవేర్చాడు.. అథ్లెటిక్స్‌లో భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించాడు. శనివారం జరిగిన జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా స్వర్ణ పతాకాన్ని ముద్దాడాడు. ఒలింపిక్స్ లో వ్యక్తిగత క్రీడల్లో గోల్డ్ మెడల్ ను అందుకున్న అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందుకున్న వీరుడిగా చరిత్ర లిఖించాడు.
ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ప్రస్తాననానికి సరికొత్త బాటలు వేసిన వీరుడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్ చేసి.. పసిడిని పట్టేశాడు.. అయితే తన గోల్డ్ మెడల్‌ను భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు అంకితమిస్తున్నానని నీరజ్ ప్రకటించాడు.
గోల్స్ మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ‘దిగ్గజం మిల్కా సింగ్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినాలనుకున్నారు. ఆయన కల నెరవేరింది. కానీ మిల్కా సింగ్ ఇప్పుడు మనతో లేరు.. కనుక తాను ఒలింపిక్స్ లో సాధించిన పసిడి పతకాన్ని మిల్కా సింగ్ కు అంకితం ఇస్తున్నానని తెలిపాడు. అంతేకాదు మిల్కా సింగ్ ఎక్కడ ఉన్నా.. తనను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని తాను ఫీల్ అవుతానని చెప్పాడు .
ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్ పసిడి పతకాన్ని అందుకోవడం ఇదే మొదటి సారి కనుక తనకే కాదని.. యావత్ భారత దేశం గర్వించదగిన విషయమని నీరజ్ చోప్రా చెప్పారు.
ఇక స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్ తనయుడు జీవ్ మిల్కా సింగ్ నీరజ్ చోప్రా విజయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒలింపిక్స్ లో భారత్ గోల్డ్ మెడల్ సాధించాలని నాన్న చాలా సంవత్సరాలు వేచి చూశారు. చివరికి భారత్ మొదటిసారి అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది.నాన్న కల నెరవేరిందని జీవ్ మిల్కా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ ట్వీట్ చేస్తున్న సమయంలో ఆనందంతో కన్నీరు వచ్చిందని.. పైన ఉన్న నాన్న కూడా ఇలాగె ఫీల్ అయ్యి ఉంటారని తెలిపారు.. దేశానికి పసిడి ఇచ్చి ఇంత ఆనందం కలిగించిన నీరజ్ కు ధన్యవాదాలు అంటూ జీవ మిల్కా సింగ్ తెలిపారు.
What a show @Neeraj_chopra1! Dad waited so many years for this to happen. His dream has finally come true with India’s first athletic gold.
I am crying as I tweet this. And I am sure dad is crying up above.
Thank you for making this happen.#Olympicsindia #Cheers4India
— Jeev Milkha Singh (@JeevMilkhaSingh) August 7, 2021
రెండు నెలల క్రితం మిల్కా సింగ్ కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మిల్కా ఆసియా అథ్లెటిక్స్‌లో నాలుగుసార్లు స్వర్ణం నెగ్గారు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగులో 0.01 సెకన్ల తేడాతో పతకం కోల్పోయిన సంగతి తెలిసిందే.