Neeraj Chopra-Usha: నా కలను నెరవేర్చిన నా కుమారుడు నీరజ్‌కు అభినందనలు : పరుగుల రాణి పీటీ ఉష
Neeraj Chopra-Usha: టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశం తొలిసారిగా అథ్లెటిక్స్ విభాగంలో అందుకుంది. ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన 125 ఏళ్ల తర్వాత భారత కల జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా రూపంలో నెరవేరింది...
Neeraj Chopra-Usha: టోక్యో ఒలింపిక్స్ 2020 లో భారత దేశం తొలిసారిగా అథ్లెటిక్స్ విభాగంలో అందుకుంది. ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన 125 ఏళ్ల తర్వాత భారత కల జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించడం ద్వారా నీరజ్ చోప్రా రూపంలో నెరవేరింది. సరిగ్గా 125 ఏళ్ల క్రితం 1896లో తొలిసారిగా ఆధునిక ఒలింపిక్స్ ఏథెన్స్ నగరంలో ప్రారంభమయ్యాయి. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ ఒలింపిక్స్ కు ఈసారి టోక్యో వేదిక అయ్యింది. ఈ విశ్వక్రీడల్లో భారత్ కు స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా పై ప్రశంసల వర్షం కురుస్తుంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ నీరజ్ ను కొనియాడుతున్నారు.
నీరజ్ చోప్రాను ప్రసిద్ధ స్ప్రింటర్ లో ఒకరైన పీటీ ఉష సోషల్ మీడియా వేదికా అభినందించారు. అంతేకాదు నీరజ్ తో తాను ఉన్న ఫోటోని షేర్ చేసి 37 సంవత్సరాల తర్వాత ఈ రోజు నా కల సాకారం అయ్యింది. థ్యాంక్ యూ మై సన్ నీరజ్ చోప్రా అంటూ.. హ్యాష్ ట్యాగ్ తో టోక్యో 2020 అంటూ ట్వీట్ చేశారు.
Realised my unfinished dream today after 37 years. Thank you my son @Neeraj_chopra1 ???#Tokyo2020 pic.twitter.com/CeDBYK9kO9
— P.T. USHA (@PTUshaOfficial) August 7, 2021
పీటీ ఉష.. ప్రఖ్యాత భారత్ స్ప్రింటర్.. పయ్యోలి ఎక్స్‌ప్రెస్ గా ప్రసిద్ధి.. గోల్డ్ గర్ల్ గా పిలుచుకునే ఉష కు ఒలింపిక్స్ లో మెడల్ తీరని కల.. ఎందుకంటే 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్య పతకాన్ని 1/100 వ సెకనులో కోల్పోయింది. ఉష కాంస్య పతకాన్ని 55.42 సెకన్లలో కోల్పోవడంతో నాల్గవ స్థానంలో నిలిచింది. దీంతో అప్పటినుంచి ఉషాకు ఒలింపిక్స్ లో మెడల్ అనేది తీరని కలగా మిగిలిపోయింది.
ప్రస్తుతం ఉన్న క్రీడాకారులు ఒలంపిక్ ఛాంపియన్ గా నిలవాలనే ఆశతో కేరళలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. బాలుస్సేరీ ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ ను పిటీ ఉష నడుపుతున్నారు.