AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ఏళ్ల తర్వాత పోరాటానికి సిద్ధమైన దిగ్గజాలు.. చెస్ చరిత్రలో సరికొత్త చరిత్రకు శ్రీకారం..!

Viswanathan Anand vs Garry Kasparov: 1995లో న్యూయార్క్‌లో జరిగిన క్లాసికల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాస్పరోవ్, ఆనంద్‌ను 10.5-7.5 తేడాతో ఓడించారు. ఆ తర్వాత వీరిద్దరూ సుదీర్ఘ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. (వీరిద్దరూ 2021లో కూడా ఓ బ్లిట్జ్ ఈవెంట్‌లో తలపడ్డారు. కానీ, ఇది పూర్తి స్థాయి ప్రదర్శన మ్యాచ్).

30 ఏళ్ల తర్వాత పోరాటానికి సిద్ధమైన దిగ్గజాలు.. చెస్ చరిత్రలో సరికొత్త చరిత్రకు శ్రీకారం..!
Viswanathan Anand Vs Garry Kasparov
Venkata Chari
|

Updated on: Oct 08, 2025 | 11:19 AM

Share

Viswanathan Anand vs Garry Kasparov: చదరంగ ప్రపంచంలో అత్యంత దిగ్గజ ప్రత్యర్థులుగా పేరుగాంచిన విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మళ్లీ ముఖాముఖి తలపడనున్నారు. 1995లో న్యూయార్క్‌లోని ఐకానిక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన వారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ తర్వాత, సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత ఈ దిగ్గజాలు తిరిగి పోటీపడనున్నారు. ఈ ఉత్కంఠభరితమైన పోరాటానికి అమెరికాలోని సెయింట్ లూయిస్ చెస్ క్లబ్ వేదిక కానుంది.

‘క్లచ్ చెస్: ది లెజెండ్స్’ వివరాలు..

పోటీ పేరు: క్లచ్ చెస్: ది లెజెండ్స్ (Clutch Chess: The Legends)

వేదిక: సెయింట్ లూయిస్ చెస్ క్లబ్, యూఎస్ఏ

పోటీ ఫార్మాట్: ఇది 12 గేమ్‌ల చెస్ 960 (ఫిషర్ రాండమ్) ఫార్మాట్‌లో జరుగుతుంది.

గేమ్స్ వివరాలు: మూడు రోజుల పాటు రోజుకు నాలుగు గేమ్స్ (రెండు రాపిడ్, రెండు బ్లిట్జ్) ఆడతారు.

బహుమతి మొత్తం: ఈ మ్యాచ్ కోసం మొత్తం ప్రైజ్ పూల్ $1,44,000 (సుమారు రూ. 1.2 కోట్లు).

విజేతకు: $70,000

రన్నరప్‌కు: $50,000

డ్రా అయితే: ఇద్దరికీ చెరో $60,000

పాయింట్ల వ్యవస్థ: ఈ ఫార్మాట్‌లో ప్రతి రోజు గెలిచిన పాయింట్లు పెరుగుతాయి. చివరి రోజు మరింత కీలకం కానుంది.

ఎందుకు ఈ పోటీ ప్రత్యేకమైనది?

30 ఏళ్ల గ్యాప్ తర్వాత: 1995లో న్యూయార్క్‌లో జరిగిన క్లాసికల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాస్పరోవ్, ఆనంద్‌ను 10.5-7.5 తేడాతో ఓడించారు. ఆ తర్వాత వీరిద్దరూ సుదీర్ఘ మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. (వీరిద్దరూ 2021లో కూడా ఓ బ్లిట్జ్ ఈవెంట్‌లో తలపడ్డారు. కానీ, ఇది పూర్తి స్థాయి ప్రదర్శన మ్యాచ్).

చెస్ 960 (ఫిషర్ రాండమ్): ఈ ఫార్మాట్‌లో ఆట ప్రారంభంలో వెనుక వరుసలోని పావులను యాదృచ్ఛికంగా (Random) అమర్చుతారు. దీనివల్ల ఆటగాళ్లు తమ ముందస్తు ఓపెనింగ్ సన్నాహాలను ఉపయోగించుకోలేరు. ఇది కేవలం ఆటగాళ్ల శుద్ధమైన వ్యూహాత్మక సామర్థ్యాన్ని, సృజనాత్మకతను మాత్రమే పరీక్షిస్తుంది.

లెజెండ్స్ రిటర్న్: 2005లో పోటీ చెస్‌కు కాస్పరోవ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఆనంద్ సెమీ-రిటైర్ అయ్యి అప్పుడప్పుడు టోర్నమెంట్లు ఆడుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ పోటీపడటం ప్రపంచవ్యాప్తంగా చెస్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తెచ్చింది.

చదరంగం చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఇద్దరు, వారి అనుభవం, వేగవంతమైన లెక్కలు, వ్యూహాత్మక నైపుణ్యాన్ని ఉపయోగించి ‘ఫిషర్ రాండమ్’ అనే కొత్త ఛాలెంజ్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ పోరాటం చెస్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..