AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mission World Cup Conclave: మిషన్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్.. మహారాష్ట్రతో జతకలిసిన టీవీ9.. ‘మహారాష్ట్ర మహాసంకల్ప్’‌తో 20 మందికి శిక్షణ..

ప్రపంచకప్ లేదా ఒలింపిక్స్ వంటి క్రీడా రంగంలో కూడా ప్రపంచ స్థాయిలో భారత్ అత్యుత్తమంగా ఆవిర్భవించే రోజు ఎంతో దూరంలో లేదని 'TV9' నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) & CEO బరున్ దాస్ అన్నారు.

Mission World Cup Conclave: మిషన్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్.. మహారాష్ట్రతో జతకలిసిన టీవీ9.. 'మహారాష్ట్ర మహాసంకల్ప్'‌తో 20 మందికి శిక్షణ..
Mission World Cup Conclave
Venkata Chari
|

Updated on: Mar 18, 2023 | 9:02 AM

Share

మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్న ‘TV9 నెట్‌వర్క్’ ఆధ్వర్యంలో మార్చి 14న ముంబైలో ‘మహారాష్ట్ర మహాసంకల్ప్ మిషన్ వరల్డ్ కప్’ సదస్సును నిర్వహించింది. దీని ద్వారా భారతదేశానికి ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌ను గెలవాలనే కలను సాకారం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగులు పడ్డాయి. గ్లోబల్ ఫుట్‌బాల్ క్లబ్ ఎఫ్‌సీ బేయర్న్ ( ఎఫ్‌సీ బేయర్న్) తో పాటు దేశంలోనే అతిపెద్ద టెలివిజన్ నెట్‌వర్క్ ‘TV9’ ఈ అపూర్వ కార్యక్రమానికి మహారాష్ట్ర ప్రభుత్వం, FC బేయర్న్ మ్యూనిచ్ క్లబ్ జతకలిశాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యాపారం, క్రీడలు, సాంఘిక సంక్షేమంలో మహారాష్ట్ర పురోగతిని హైలైట్ చేయడానికి ‘TV9 మరాఠీ’ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ మేరకు ఫుట్‌బాల్ ప్రపంచ కప్ కోసం భారతదేశానికి రోడ్‌మ్యాప్‌ను కూడా సిద్ధం చేయనున్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌గా FC బేయర్న్‌ పేరుగాంచిన సంగతి తెలిసిందే.

FC బేయర్న్ తన ‘మియా శాన్ మియా’ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా యువతకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విలువలతో కూడిన శిక్షణను అందిస్తోంది. ముఖ్యంగా ఈ  భాగస్వామ్యంతో జ్ఞానం, సంప్రదాయం, శిక్షణా పద్ధతుల నిరంతర మార్పిడిపై దృష్టి కేంద్రీకరించింది.

ఎఫ్‌సీ బేయర్న్ మహారాష్ట్ర కప్‌నకు ఎంపికైన 20 మంది బాయ్స్‌ను మహారాష్ట్ర క్రీడా మంత్రి గిరీష్ మహాజన్ అభినందించారు. వీరు శిక్షణ కోసం జర్మనీకి వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

గ్లోబల్ స్పోర్ట్స్‌లో రాణించే దిశగా భారతదేశం: బరున్ దాస్..

భారతదేశం విభిన్న రంగాలలో ప్రపంచ ఎజెండాతో ముందుకు సాగుతోంది. ఆర్థిక శాస్త్రం, రాజకీయాల నుంచి మొదలుపెట్టిన భారత్.. ఇప్పుడు ఆస్కార్ విభాగంలో కూడా ప్రభావాన్ని చూపించింది. వరల్డ్ కప్ లేదా ఒలింపిక్స్ వంటి క్రీడా రంగంలో కూడా భారతదేశం ప్రపంచ స్థాయిలో గొప్పగా ఎదిగే రోజు ఎంతో దూరంలో లేదని ‘టీవీ9’ నెట్‌వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో బరుణ్ దాస్ తెలిపారు.

TV9 నెట్‌వర్క్ మహారాష్ట్ర ప్రభుత్వం, FC బేయర్న్ మ్యూనిచ్ క్లబ్‌తో పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉందని, దీంతో ప్రపంచకప్ ఫుట్‌బాల్ కల సాకారం అవుతుందని, భారత్‌లోని ఫుట్‌బాల్ ప్రతిభావంతులకు అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని బరున్ దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పాఠశాల విద్య, క్రీడల శాఖ మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ రంజిత్ సింగ్ డియోల్, స్పోర్ట్స్ కమిషనర్ అండ్ యూత్ సర్వీస్ సుహాస్ దివాసే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈవెంట్‌లో 20 మంది యువ ఫుట్‌బాల్ ప్లేయర్లకు సత్కారం:

1 ఆదిత్య పవన్ గుప్తా

2 మహ్మద్ రిజ్వానుద్దీన్ జైనులాబీదిన్

3 సామ్రాట్ కృష్ణత్ మోర్బలే

4 నెతన్ డోల్ఫీ వాజ్

5 ఆదిత్య మాధవ్ లేకమి

6 ర్యాన్ రోనాల్డ్ పెరీరా

7 స్వరాజ్ మహేష్ సావంత్

8 యువరాజ్ సందీప్ కదమ్

9 ఖ్వైరక్పం నిబాష్ సింగ్

10 యుగ్ సంతోష్ జింజే

11 రాఘవ్ పంకజ్ కనోడియా

12 వేద్ ప్రకాష్ పటేల్

13 సర్వేష్ నితిన్ యాదవ్

14 రాజ్‌వీర్ సుజిత్ గురవ్

15 పార్థ్ విజయ్ తాల్కోకుల్

16 ధ్రువ్ సందీప్ గనోర్

17 సచిన్ యోగేష్ సోనిస్

18 శౌర్యజీత్ సారంగ్ పాటిల్

19 శివమ్ అభిషేక్ కుమార్ సింగ్

20 రియో జైదీప్ పనే

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..