Paris Olympics 2024: మరికొద్దిసేపట్లో ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలు.. ఎక్కడ చూడొచ్చంటే?
Paris Olympics 2024 Closing Ceremony: రెండు వారాలకుపైగా జరిగిన 2024 పారిస్ ఒలింపిక్స్ ఈరోజుతో పూర్తి కానున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ గ్రాండ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆగస్టు 11న అంటే నేటితో ముగియనుంది. ఎన్నో వివాదాల మధ్య జరిగిన ఈసారి ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 10,000 మందికి పైగా పోటీదారులు పతకాల కోసం పోరాడారు. భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.
Paris Olympics 2024 Closing Ceremony: రెండు వారాలకుపైగా జరిగిన 2024 పారిస్ ఒలింపిక్స్ ఈరోజుతో పూర్తి కానున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ గ్రాండ్ స్పోర్ట్స్ ఈవెంట్ ఆగస్టు 11న అంటే నేటితో ముగియనుంది. ఎన్నో వివాదాల మధ్య జరిగిన ఈసారి ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 10,000 మందికి పైగా పోటీదారులు పతకాల కోసం పోరాడారు. భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. కానీ, ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఈ క్రీడల్లో భారత్ కేవలం 6 పతకాలు మాత్రమే గెలుచుకోగలిగింది. వీటిలో 1 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ ముగింపు వేడుకకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ క్రమంలో ముగింపు వేడుకలను ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ముగింపు వేడుకల పూర్తి వివరాలు..
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి?
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సోమవారం ఆగస్టు 12న ఉత్తర పారిస్‌లోని స్టేడ్ డి ఫ్రాన్స్‌లో జరగనున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక ఎప్పుడు ప్రారంభమవుతుంది?
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు సోమవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలను టీవీలో ఎక్కడ చూడొచ్చు?
పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలను స్పోర్ట్స్-18 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జియో సినిమా యాప్‌లో ఆన్‌లైన్‌లో పూర్తి ఉచితంగా చూడవచ్చు.
భారతదేశ పతాకధారులు ఎవరు?
ముగింపు వేడుకలో భారత్ నుంచి 22 ఏళ్ల షూటర్ మను భాకర్, హాకీ లెజెండ్ పీఆర్ శ్రీజేష్ జెండా బేరర్లుగా వ్యవహరించనున్నారు. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా, మిక్స్‌డ్ షూటింగ్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అలాగే పురుషుల హాకీలో కాంస్య పతకం సాధించి హాకీకి వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేష్, మను భాకర్ తో కలిసి పతాకధారణ చేయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..