Paris Olympics: ఆ ఫుట్‌బాల్ స్టార్‌ నాకు ప్రైవేట్‌ మెసేజ్‌ చేశాడు..: షాకింగ్ న్యూస్ చెప్పిన ఒలింపిక్ ‘బ్యూటీ’

Paraguayan Swimmer Luana Alonso: పరాగ్వేకు చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో పారిస్ ఒలింపిక్ గేమ్స్ విలేజ్ నుంచి పంపించేసిన సంగతి తెలిసిందే. తన అందం కారణంగా ఇతర ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు గుర్తించి, ఇంటికి పంపినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో లువానా అలోన్సో ఓ షాకింగ్ ప్రకటన చేసింది.

Paris Olympics: ఆ ఫుట్‌బాల్ స్టార్‌ నాకు ప్రైవేట్‌ మెసేజ్‌ చేశాడు..: షాకింగ్ న్యూస్ చెప్పిన ఒలింపిక్ ‘బ్యూటీ’
Paraguayan Swimmer Luana Alonso
Follow us

|

Updated on: Aug 11, 2024 | 7:52 PM

Paraguayan Swimmer Luana Alonso: పరాగ్వేకు చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో పారిస్ ఒలింపిక్ గేమ్స్ విలేజ్ నుంచి పంపించేసిన సంగతి తెలిసిందే. తన అందం కారణంగా ఇతర ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు గుర్తించి, ఇంటికి పంపినట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో లువానా అలోన్సో ఓ షాకింగ్ ప్రకటన చేసింది. బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ సందేశం పంపాడని అలోన్సో చెప్పుకొచ్చింది. అయితే, ఆ మెసేజ్‌లో నెయ్‌మార్ ఏం రాశాడో మాత్రం చెప్పనంటూ ట్విస్ట్ ఇచ్చింది.

ఒలింపిక్ క్రీడా గ్రామంలో తోటి ఆటగాళ్లకు ఇబ్బందులు సృష్టించిందని ఆరోపిస్తూ ఒలింపిక్ నిర్వాహక కమిటీ ఆమె పారిస్ ఒలింపిక్స్ గ్రామం నుంచి పంపించినట్లు నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఒక రోజు తర్వాత అలోన్సో ఈ విషయంపై కీలక ప్రకటన చేసింది.

‘నెయ్‌మార్‌ ఓ ప్రైవేట్‌ సందేశం పంపాడు’..

తాజాగా లువానా అలోన్సో, పరాగ్వే రేడియో షో ఐరే డి టోడోస్‌తో మాట్లాడుతూ, బ్రెజిల్ మాజీ కెప్టెన్ తనకు పెద్ద అభిమాని అని పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్ క్రీడా గ్రామం నుంచి నన్ను ఎవరు పంపలేదు. బహిష్కరించలేదని చెప్పుకొచ్చింది. అయితే, తప్పుడు ప్రచారం చేయవద్దంటూ కోరింది. స్విమ్మింగ్ పోటీల్లో ఓడిపోవడంతో గ్రామం నుంచి తనే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..