IRL 2022: యథావిధిగానే ఇండియన్ రేసింగ్ లీగ్.. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ లోనే ఫైనల్.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌ఎండీఏ
Indian Racing League 2022: ఇండియన్ రేసింగ్ లీగ్, ఫార్ములా -e వేర్వేరని హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఫార్ములా- ఈ కోసం రెడీ చేస్తున్న ట్రాక్ పైనే ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది.
డిసెంబర్ 10,11న యథావిధిగానే ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించునన్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. హుస్సేన్ సాగర్ పక్కన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్ లోనే IRL ఫైనల్ రేస్ ఉంటుదని క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 19, 20 తేదీల్లో జరగాల్సిన రేస్.. ప్రమాదాల కారణంగా నిలిచిపోయింది. దీంతో ఫార్ములా-4 రేస్ తోనే నిర్వహకులు సరిపెట్టారు.
దీంతో ఇండియన్ రేసింగ్ లీగ్‌ను ప్రాక్టీస్ తోనే ముగించేశారు నిర్వహకులు. దీంతో డిసెంబర్‌లో జరిగే ఇండియా రేసింగ్ లీగ్ పై అనుమానాలు నెలకొన్నాయి.
దీంతో అసలు ఐఆర్‌ఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాల నేపథ్యంలో.. సేమ్ ట్రాక్ పై యథావిధిగా రేస్ ఉంటుందని హెచ్‌ఎండీఏ క్లారిటీ ఇచ్చింది.
ఈ రేస్ లో అనుభవాలతో వచ్చే ఏడాది ఫిబ్రవరి లో జరిగే ఫార్ములా-e కి మరింత సిద్దం అవుతామని హెచ్‌ఎండీఏ చెబుతోంది.
ఇండియన్ రేసింగ్ లీగ్, ఫార్ములా -e వేర్వేరని హెచ్‌ఎండీఏ పేర్కొంది. ఫార్ములా- ఈ కోసం రెడీ చేస్తున్న ట్రాక్ పైనే ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తామని చెప్పుకొచ్చింది. అసలైన ఫార్ములా -ఈ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..