Cristiano Ronaldo: ఆ లెజెండరీ ఫుట్ బాట్ ప్లేయర్ ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డ్.. అదెమిటో మీకు తెలుసా..?
పోర్చుగల్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్, ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ అయిన క్రిస్టియానో.. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఘానాతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రికార్డును..
ఫుట్‌బాల్ అభిమానులు కానివారు చాలామంది ఉంటారు.. కానీ క్రిస్టియానో రొనాల్డో అనే పేరును ఒక్కసారి కూడా విననివారు ఉండరు. ఫుట్‌బాల్ చరిత్రంలో అతను ఓ లెెజెండ్. పోర్చుగల్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్, ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ అయిన క్రిస్టియానో.. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఘానాతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రికార్డును నమోదుచేశాడు. పురుషుల ప్రపంచకప్ చరిత్రలో ఐదు వేర్వేరు టోర్నమెంట్లలో గోల్ చేసిన మొదటి ఆటగాడిగా అతను నిలిచాడు. ఈ వారం ప్రారంభం వరకూ కూడా అతను నాలుగు వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో గోల్ చేసిన ఆటగాడిగా పీలే, ఉవే సీలర్, మిరోస్లావ్ క్లోస్, లియోనెల్ మెస్సీతో పాటు ఉండేవాడు.
కానీ ఇప్పుడు ఐదు వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో గోల్స్ చేసిన రొనాల్డో రికార్డు పుస్తకాలలో ఒంటరిగా నిలిచాడు. అయితే క్రస్టియానో రొనాల్డో 2006 తర్వాత జరిగిన ప్రతి ప్రపంచ కప్‌లో తన స్కోర్‌ను నమోదు చేశాడు. ప్రపంచ కప్‌లో అతని మొదటి గోల్ 2006లో ఇరాన్‌పై చేశాడు. 2010లో ఉత్తర కొరియాపై.. 2014లో ఘానాపై..చేశాడు. 2018 నాటికి ఇంటర్నేషనల్ గోల్ క్రేజీగా పోర్చుగల్ మారడానికి.. అతను ఘనాపై 2014లో చేసిన గోలే కారణం. 2018లో కూడా గోల్ చేసిన రొనాల్డో.. తన గోల్ స్కోరింగ్ పరంపర కొనసాగిస్తూనే గురువారం ఘానాతో జరిగిన మ్యాచ్‌లో కూడా గోల్ చేశాడు.
Out of this world ??
? Cristiano Ronaldo becomes the first man to score at five FIFA World Cups#FIFAWorldCup | @Cristiano pic.twitter.com/3UKqXLsZWd
— FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022
ఈ విధంగా పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటికి మొత్తం 8 గోల్స్ చేశాడు. 2006,2010,2014 సంవత్సరాలలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్లలో కేవలం ఒక గోల్‌నే చేసిన అతను.. 2018 ప్రపంచ కప్‌లో ఏకంగా 4 గోల్స్ చేశాడు. ఇది ఒకే టోర్నమెంట్‌లో అతని అత్యధిక గోల్స్.
కాగా, ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం ఘానాతో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో.. క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ 3-2 తేడాతో విజయం సాధించింది.
ఫిఫా ప్రపంచకప్ ఖతర్ 2022లో టాప్ స్కోరర్లు..
ఖతర్ వేదికగా జరుగుతున్న ఈ ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇప్పటికి ఆరుగురు ఆటగాళ్లు రెండేసి పరుగులు చేసి స్కోర్ బోర్డ్‌లో నిలిచారు. వారిలో ఇంగ్లాండు ప్లేయర్ బుకాయో సాకా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక తర్వాతి స్థానాలలో వరుసగా.. ఈక్వెడర్ ఆటగాడు ఎన్నర్ వాలెన్సియా, స్పెయిన్ నుంచి ఫర్రన్ టొర్రెస్, ఇరాన్ ఆటగాడు మెహ్దీ తరేమి ఉన్నారు. 5వ స్థానంలో ఫ్రాన్స్ ప్లేయర్ ఒలివర్ గిరోడ్, ఆరో స్థానంలో బ్రెజిల్ యువకెరటం రిచర్లిసన్ ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..