Hockey World Cup 2023: క్రాస్ ఓవర్‌లో న్యూజిలాండ్‌తో ఢీ కొట్టనున్న భారత్.. గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంట్రీ..

Men's Hockey World Cup: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు క్రాసోవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది.

Hockey World Cup 2023: క్రాస్ ఓవర్‌లో న్యూజిలాండ్‌తో ఢీ కొట్టనున్న భారత్.. గెలిస్తే క్వార్టర్ ఫైనల్స్‌కు ఎంట్రీ..
Fih Hockey World Cup 2023
Follow us

|

Updated on: Jan 20, 2023 | 1:50 PM

ఒడిషాలో జరుగుతున్న 15వ హాకీ ప్రపంచ కప్ (Hockey World Cup 2023)లో భారత హాకీ జట్టు.. తన తదుపరి మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇది క్రాస్ ఓవర్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు క్వార్టర్‌ఫైనల్‌లో చోటు దక్కించుకుంటుంది. ఇరు జట్లు తమ తమ పూల్స్‌లో అగ్రస్థానంలో నిలవలేకపోయాయి. అందుకే ఈ జట్లు ఇప్పుడు క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లు ఆడవలసి ఉంది.

ఈ ప్రపంచకప్‌లో నాలుగు పూల్స్‌లో 16 జట్లు ఉన్నాయి. ప్రతి పూల్‌లో గెలిచిన జట్టు నేరుగా క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుంటుంది. రెండవ, మూడవ స్థానాల్లో ఉన్న జట్లు క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల కింద క్వార్టర్-ఫైనల్‌కు చేరుకోగలవు. పూల్-డిలో భారత జట్టు ఉంది. ఇక్కడ ఇంగ్లాండ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత జట్టు కూడా 7 పాయింట్లు సాధించినా తక్కువ గోల్ తేడాతో రెండో స్థానంలోనే కొనసాగింది. మరోవైపు పూల్-సిలో న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచింది.

భారత జట్టుదే పైచేయి..

ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత, ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ 0-0 డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో వేల్స్‌పై భారత్‌ 4-2తో విజయం సాధించింది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ పూల్‌లో నెదర్లాండ్స్, మలేషియాపై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. చిలీపై ఏకైక విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

హాకీ ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ క్రాస్ ఓవర్ మ్యాచ్ జనవరి 22న సాయంత్రం 7 గంటలకు జరగనుంది. భువనేశ్వర్‌లోని కళింగ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 ఎస్‌డీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2 హెచ్‌డీలో చూడొచ్చు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం డిస్నీ + హాట్‌స్టార్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!