Carlos Alcaraz : గతంలో కంటే 39 శాతం ఎక్కువ ప్రైజ్ మనీ.. అల్కరాజ్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాకే
కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకోవడంతో, అతనికి భారీగా ప్రైజ్ మనీ లభించింది. రెండవసారి యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన అల్కరాజ్‌కు గతంలో కంటే 39 శాతం ఎక్కువ ప్రైజ్ మనీ లభించింది. అయితే, ప్రైజ్ మనీలో ఇంత పెరుగుదల ఎందుకు? అల్కరాజ్‌కు అంత ఎక్కువ డబ్బు ఎందుకు వచ్చింది?

Carlos Alcaraz : కార్లోస్ అల్కరాస్ యూఎస్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఛాంపియన్ అయిన తర్వాత అతనికి భారీగా బహుమతి డబ్బు లభించింది. రెండవసారి యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన అల్కరాజ్‌కు గతంలో కంటే 39 శాతం ఎక్కువ ప్రైజ్ మనీ లభించింది. అయితే, ప్రైజ్ మనీలో ఇంత పెరుగుదల ఎందుకు? అల్కరాజ్‌కు అంత ఎక్కువ డబ్బు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు, ఫైనల్ మ్యాచ్ గురించి ఓ లుక్కేద్దాం. అల్కరాజ్ ఎలా సిన్నర్‌ను ఓడించి టైటిల్‌ను గెలిచాడు. అలాగే వరల్డ్ నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
39 శాతం పెరిగిన ప్రైజ్ మనీ
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్‌లో ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్‌ను కార్లోస్ అల్కరాజ్ ఓడించాడు. ఈ విజయంతో అతను పురుషుల సింగిల్స్‌లో కొత్త వరల్డ్ నంబర్ 1గా నిలిచాడు. అల్కరాజ్ 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో యూఎస్ ఓపెన్ ఫైనల్ గెలుచుకోవడంతో, అతనికి 39 శాతం ఎక్కువ ప్రైజ్ మనీ లభించింది. ఈ పెరుగుదలకు కారణం టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రైజ్ మనీని పెంచడం.
గత సంవత్సరం వరకు యూఎస్ ఓపెన్‌లో విజేతకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు 31.74 కోట్ల రూపాయలు) లభించేవి. కానీ 2025లో ఈ ప్రైజ్ మనీని 39 శాతం పెంచి 5 మిలియన్ డాలర్లు (సుమారు 44 కోట్ల రూపాయలు) చేశారు. అల్కరాజ్‌కు ఈ భారీ మొత్తమే లభించింది. రన్నరప్ అయిన యానిక్ సిన్నర్‌కు దానిలో సగం అంటే, సుమారు 22 కోట్ల రూపాయలు లభించాయి.
అల్కరాజ్ నికర విలువ
కొత్త వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ నికర విలువ కూడా భారీగానే ఉంది. అల్కరాజ్ ఆదాయంలో ఎక్కువగా ప్రైజ్ మనీ నుంచే వస్తుంది. ఒక నివేదిక ప్రకారం, కార్లోస్ అల్కరాజ్ మొత్తం నికర విలువ సుమారు 356 కోట్ల రూపాయలు. ఈ విజయంతో అతడి నికర విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




